/rtv/media/media_files/2024/10/16/3o7YIlG5uJRJ6Z9IEXEk.jpg)
ChandraBabu Naidu : స్కిల్ డవలప్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి రూ.23 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ప్రకటించింది.. ఢిల్లీ, ముంబై ,పూణేలలోని సిమెన్స్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. ఏపీ జగన్ సర్కార్ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. నకిలీ ఇన్ వాయిస్ ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
Also Read: భారత్ గడ్డపై 36 ఏళ్లుగా.. ఆ జట్టు విజయం కోసం ఎదురుచూపు
స్కిల్ కేసులో చంద్రబాబుకి ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ విషయం గురించి సీఐడీ కేసులు కూడా పెట్టింది. చంద్రబాబుకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబుకి బెయిల్ వచ్చింది. ఆ కేసులో సీఐడీ ఒక్క రూపాయి అక్రమ లావాదేవీ చూపించలేకపోయిందని బెయిల్ ఇచ్చిన సమయంలో హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కేసులోతాజాగా ఈడీ చేసిన ప్రకటన మరింత కీలకంగా మారింది.
Also Read: మహిళలకు గుడ్‌న్యూస్.. ఆరోజు నుంచే ఫ్రీ బస్ అమలు
ED Clears Chandrababu Naidu in Skill Development Scam, Contradicts AP Police’s 2023 Claims
— Sudhakar Udumula (@sudhakarudumula) October 15, 2024
The Enforcement Directorate (ED) has given a clean chit to former Andhra Pradesh Chief Minister and Telugu Desam Party (TDP) president, N Chandrababu Naidu, in the multi-crore Andhra… pic.twitter.com/mLBOH2Z7vA
చంద్రబాబుకు క్లీన్ చిట్
ఈడీ తాజా విచారణ తర్వాత చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది. ఈడీ విచారణ ప్రకారం.. నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేదని నిరూపణ అయ్యింది. వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్, వంటి వారు బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించి ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ స్టేట్ మెంట్ లో నమోదు కాలేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయన కు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చూపించలేదు. దీంతో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్లు అయ్యింది.
Also Read: సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రత..24/7 పోలీస్ పెట్రోలింగ్
ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ జరగలేదు..!
అయితే ఆ కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన సొమ్ము మళ్లీ చంద్రబాబు వద్దకు చేరిందని సీఐడీ ఆరోపించింది. చివరికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయని కూడా వాదనలు వినిపించాయి. అయితే అనూహ్యంగా తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్లు వెలుగులోకి వచ్చాయి. టీడీపీకి స్కిల్ కేసులో ఉన్న ఒక్క కంపెనీ కూడా విరాళాలు ఇచ్చినట్లు లేదు. ఇప్పుడు చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఆధారాల్లేకుండా తప్పుడు కేసులు పెట్టినట్లుగా రుజువు అయిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!