/rtv/media/media_files/2025/11/11/lord-hanuman-2025-11-11-11-47-45.jpg)
Lord Hanuman
హిందూ ధర్మంలో మంగళవారం (Tuesday) రోజును హనుమంతుడికి (Lord Hanuman) అంకితం చేశారు. ఈ రోజున పూజను సరైన నియమాలతో చేస్తే.. జీవితంలోని కష్టాలు తొలగిపోయి.. ఆంజనేయుడి ఆశీస్సులు లభిస్తాయి. అయితే మంగళవారం రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. వాటిని పాటించకపోతే హనుమంతుడు అలిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆయన అనుగ్రహం లభించదు. ఆ నియమాలు, పూజా విధానం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మంగళవారం హనుమాన్ పూజా నియమాలు:
మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరం.. మల్లెనూనె (Jasmine Oil), బెల్లం, శెనగలు సమర్పించడం శుభప్రదమని నమ్ముతారు. ఎరుపు రంగు పువ్వులను సమర్పించి.. దీపం వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. బలం, రక్షణ కోసం ఆయనను ప్రార్థించాలి. ఆలయంలో నూనె లేదా సింధూరం సమర్పించిన తర్వాత నేరుగా ఇంటికి తిరిగి రావాలి. పూజ సమయంలో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించి.. హారతి ఇవ్వడం ముఖ్యమైనది. మంగళవారం రోజున మాంసం, చేపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి వాటిని తినకూడదు. ఈ రోజున సాత్విక ఆహారం (Sattvic Food) మాత్రమే తీసుకోవాలి. స్వచ్ఛమైన ఆహారం మనస్సును ప్రశాంతంగా ఉంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
ఇది కూడా చదవండి: చలికాలంలో బెల్లమే కదా అని అనుకోకండి.. నువ్వులతో కలుపుకొని తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి!!
శాస్త్రాల ప్రకారం.. మంగళవారం ఉపవాసం (Fast) పాటించడం వల్ల అంగారక గ్రహం (Planet Mars) యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి.. జీవితంలో విజయం లభిస్తుంది. ఉపవాసం పాటించే వ్యక్తి పండ్లు లేదా తేలికపాటి ఆహారాన్ని రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఉపవాస సమయంలో నిరంతరం హనుమంతుడి నామాన్ని జపించడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటాయి. మంగళవారం శివుడిని (Lord Shiva) పూజించడం కూడా శుభప్రదంగా చెబుతారు. శివలింగానికి నీరు, పాలు లేదా గంధం సమర్పించాలి. ఈ రోజున అబద్ధాలు చెప్పడం లేదా కోపం తెచ్చుకోవడం పాపంగా చెబుతారు. ఎవరినీ విమర్శించడం లేదా అవమానించడం మానుకోవాలి. ఇనుమును దానం చేయకుండా.. దానికి బదులుగా బెల్లం లేదా ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం మంచిది. ఈ నియమాలను పాటించడం ద్వారా భక్తులు హనుమంతుడి అనుగ్రహానికి పాత్రులవుతారని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ఈ శీతాకాలంలో వెచ్చగా నిద్రపోవాలంటే.. మీ బెడ్రూంలో ఈ 5 మార్పులు చేయండి!
Follow Us