Road Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన వారు కారులో విశాఖపట్నానికి బయల్దేరారు. ఇంతలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో కారు, లారీ ఢీకొన్నాయి.
డ్రైవర్ అతివేగంతో..
Also Read: కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి
నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన లారీ డ్రైవర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుల వివరాలు తెలుసుకుని బంధువులకు సమాచారం అందించారు.
Also Read: వెల్లుల్లి తింటే పురుషులకు అద్భుత ప్రయోజనాలు
Also Read: దామగుండం అడవిలో అగ్నిప్రమాదం.. అధికారులా పనేనా !
Also Read: బెండకాయతో పొరపాటున ఇవి తినకండి