UP: నువ్వేం తల్లివి తల్లీ.. రీల్స్‌ పిచ్చితో పిల్లను చంపేసింది

ఉత్తరప్రదేశ్‌లో కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఐదేళ్ల బాలిక గంగ స్నానానికి వెళ్లి గల్లంతైంది. నీటిలో మునిగిపోయి ప్రవాహానికి కొట్టుకుని తల్లి పక్కనుంచే వెళ్తున్నా రీల్స్‌లో మైకంలో గుర్తించలేదు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.

New Update
ganga river

UP: రీల్స్‌ పిచ్చి రోజు రోజుకు ముదురుతోంది. లైక్‌ల కోసం కన్నకూతురిని పట్టించుకోకుండా ప్రాణాలు పోవడానికి కారణమైంది ఓ తల్లి. సోమవారం ఉదయం గంగా నదిలో ఐదేళ్ల బాలిక గల్లంతైంది. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. ఇదంతా ఆ చిన్నారి తల్లి ఎదుటే జరిగినా రీల్స్‌ మైకంలో గుర్తించలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని సైద్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.

కార్తీక సోమవారం సందర్భంగా..

వారణాసిలోని ఉమ్రా గ్రామానికి చెందిన సందీప్ పాండే భార్య అంకిత ఆమె ఐదేళ్ల కుమార్తె తాన్యను తీసుకొని ఛత్ పూజ కోసం బౌర్వాన్ గ్రామంలోని తండ్రి మిశ్రా ఇంటికి వచ్చింది. కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి గంగ స్నానానికి వెళ్లారు. అందరూ స్నానం చేస్తుండగా తాన్య ఒడ్డుపై నిలుచుంది. తల్లి అంకిత మాత్రం మరొకరికి ఫోన్‌ ఇచ్చి రీల్స్‌ చేసే పనిలో బిజీగా ఉంది. ఒడ్డున ఉన్న తాన్య ఒక్కసారిగా నీటిలోకి దిగింది. ఎవరూ గమనించలేదు. దీంతో మునిగిపోయి ప్రవాహానికి కొట్టుకుపోయింది. పక్కనుంచే వెళ్తున్నా తల్లి అంకిత మాత్రం రీల్స్‌లో బిజీగా ఉండిపోయింది. 

 


కాసేపటికి తాన్య కోసం కుటుంబ సభ్యులంతా వెతకడం ప్రారంభించారు. ఎక్కడా జాడ కనిపించలేదు. ఆ తర్వాత ఫోన్‌లో వీడియోలు చూస్తే షాకింగ్‌ విషయం బయటపడింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానిక డైవర్ల సహాయంతో రెండు గంటల తర్వాత చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. తర్వాత తాన్యను వెంటనే దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి తాన్య మృతి చెందినట్టు చెప్పారు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సైద్‌పూర్ పోలీసులు చిన్నారి మృతదేహానికి పంచనామా చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 

ఇది కూడా చదవండి: ఒకరు ఆవలిస్తే మనం ఎందుకు ఆవలిస్తాం..ఇది అంటువ్యాధా?

 

 

ఇది కూడా చదవండి: వైరల్‌ అవుతున్న యోగి పువ్వు నిజమేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు