Yogi Flower: వైరల్‌ అవుతున్న యోగి పువ్వు నిజమేనా?

టర్కీలో కనిపించే ఈ పువ్వు ధ్యానం చేసే యోగిలా కనిపిస్తుంది. మన సరస్సుల్లో వికసించే తామరలా అందంగా కనిపిస్తోంది. యోగి పుష్పం వేసవిలో ముదురు నలుపు, మిగిలిన సీజన్లో ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ప్రత్యేక యోగి పుష్పం ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించింది

New Update
Yogi Flower

Yogi Flower

Yogi Flower: ప్రపంచంలో ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి. కొన్ని అందంగా ఉంటే మరికొన్ని చూసేందుకు విచిత్రంగా ఉంటాయి. టర్కీలో పద్మాసనం ఆకారంలో ఉన్న యోగి పువ్వు చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరుదైన యోగి పువ్వులు ఉర్ఫా ప్రావిన్స్‌కు సమీపంలోని హాల్‌ఫెటి గ్రామంలో మాత్రమే పెరుగుతాయని అంటున్నారు. నేల ప్రత్యేక లక్షణాలు, pH స్థాయిలకు అనుగుణంగా సున్నితంగా ఉండే ఆంథోసైనిన్ పిగ్మెంట్ల కారణంగా ఇలాంటి పువ్వులు వస్తాయని చెబుతున్నారు. ఈ పువ్వులు వేసవిలో నలుపు, ఇతర సీజన్లలో ముదురు ఎరుపు రంగులో కనిపిస్తాయని సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. Xలో చాలా మంది వినియోగదారులు సహజ యోగి పుష్పం ఫొటోలను షేర్‌ చేశారు.

వేసవిలో మొగ్గలుగా నల్లగా..

చాలా అరుదైన పుష్పం ఇదని, ఉర్ఫా ప్రావిన్స్ సమీపంలోని హాల్ఫెటి గ్రామంలో మాత్రమే ఉంటాయని అంటున్నారు. మరొక వినియోగదారు యుఫ్రేట్స్‌గా పిలిచే సహజ యోగి పువ్వులు పెరిగే ఏకైక ప్రదేశం టర్కీ అని రాశారు. సహజమైన యోగి పుష్పం దావా అనేది AI ద్వారా రూపొందించారని చెబుతున్నారు. టర్కీలో అసలు యోగి ఫ్లవర్ లేదని అంటున్నారు. టర్కీలోని హాల్ఫెటీలో కారా గుల్ అని పిలవబడే గులాబీలు ముదురు ఎరుపు రంగులో వికసిస్తాయి. వేసవిలో మొగ్గలుగా నల్లగా కనిపిస్తాయి.

వాటికి నిర్దిష్ట pH స్థాయిలు అవసరమవుతాయి. వేసవిలో నల్లగా, ఇతర సీజన్లలో ఛాయలు మారుతాయి. నిజానికి ఇక్కడ స్థానికులు ఈ గులాబీలను పండించి, పర్యాటకులకు విక్రయిస్తారు. ప్రతి వసంతంలో హల్‌ఫెటీని సందడిగా ఉండే కేంద్రంగా మారుస్తారు. AI ద్వారానే చేసే అవకాశం 99.9% ఉందని నిపుణులు అంటున్నారు. అసలు ఇలాంటి పుష్పాలు ఉండే అవకాశమే లేదని చెబుతున్నారు. ఇంకా టర్కీలోని హాల్ఫెటీలో యోగి ఫ్లవర్ అనే పేరుతో ఒక పువ్వు వికసిస్తుందని నిర్ధారించే ఆధారాలు ఎక్కడా లేవు. అయితే గూగుల్ సెర్చ్‌లో హాల్ఫెటి గులాబీలు విభిన్న రంగుల్లో ఉంటాయని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఠాగూర్‌ సినిమాను మరిపించే సీన్‌..హైదరాబాద్‌లో దారుణం

 

 

ఇది కూడా చదవండి: మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్‌కు కారణం?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు