Ramadan: ఖర్జూరాలతో ఉపవాసం ఎందుకు విరమించాలి..? దీని వెనుక అసలు కారణమిదే

రంజాన్ ఉపవాస సమయంలో మొదటగా ఖర్జూరాలతో ఉపవాసాన్ని విరమించడానికి శాస్త్రీయ కారణం ఉంది. దీనిలోని సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే అధిక నీటి శాతం డీహైడ్రేషన్ ను నివారించడానికి సహాయపడుతుంది.

New Update
Ramadan Fasting : రంజాన్‌ మాసంలో ఖర్జూరం పండుకు ఎందుకు అంత ప్రాముఖ్యతో తెలుసా!

30 రోజుల పాటు కొనసాగే రంజాన్ మాసంలో  ముస్లింలు సూర్యోదయం నుంచి  సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు.  ఈ సమయాన్ని  రోజా అని పిలుస్తారు. రంజాన్ మాసంలో  చంద్రుడిని చూసిన తర్వాత  మొదటి ఉపవాసం ఉంటారు. ఉపవాసం సమయంలో  సూర్యోదయానికి ముందును సెహ్రీ అంటారు.  సూర్యాస్తమయానికి ఇఫ్తార్ చేస్తారు. అయితే ఇఫ్తార్ సమయంలో, ఉపవాసం ఉండే వ్యక్తులు ముందుగా ఖర్జూరతో విరమిస్తారు. అసలు ఉపవాసం విరమించడానికి ముందుగా  ఖర్జూరాలు ఎందుకు తింటారో తెలుసా?

 ముందుగా ఖర్జూరాలు ఎందుకు తింటారు?

ఖర్జూరతో  ఉపవాసం విరమించే సంప్రదాయం ప్రవక్త ముహమ్మద్ కాలం నుంచి  కొనసాగుతోంది. అబ్రహమిక్ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ప్రవక్త స్వయంగా ఖర్జూర, నీటితో తన ఉపవాసాన్ని విరమించారని చెబుతారు.   ఆ తరువాత  ఈ పద్ధతి  ఒక సంప్రదాయంగా మారింది. ఇదే  నేటికీ కొనసాగుతోంది. 

ఖర్జూరతో ఉపవాసం విరమించడంతో ప్రయోజనాలు 

  • అయితే  ఇఫ్తార్ సమయంలో ముందుగా ఖర్జూరం తినడం మధ్య ఆధ్యాత్మిక సంబంధం కూడా ఉంది. అలాగే ఉపవాసాన్ని బ్రేక్ చేయడానికి  విచ్ఛిన్నం చేయడానికి మంచి ఎంపికగా చెబుతారు. దీనిలో  అనేక పోషక విలువలు ఉంటాయి. 
  • ఖర్జూరాలలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు వంటి  అవసరమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు దీర్ఘకాలం ఆకలితో ఉన్న తర్వాత శక్తిని తిరిగి నింపడానికి సహాయపడతాయి.
  • ఖర్జూరాలు సహజంగా తీపిగా ఉంటాయి.  ఇవి రోజంతా ఆకలితో ఉన్న తర్వాత తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో ఉండే సహజ చక్కెరలు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్,  సుక్రోజ్, రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. శరీరానికి క్షణ శక్తిని అందిస్తాయి.
  • ఖర్జూరలో  అధిక మొత్తంలో నీరు ఉంటుంది. శారీరక పనితీరును నిర్వహించడానికి,  డీహైడ్రేషన్ ను నివారించడానికి ఉపవాసం సమయంలో ఇవి  చాలా ముఖ్యమైనవి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also read :  Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు