గర్భం దాల్చిన సమయంతో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే గర్భిణితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే గర్భిణులు మాత్రం ఆరోగ్య విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. సరైన సమయానికి ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం, నిద్రపోవడం వంటివన్నీ చేయాలి. అయితే తెలియక కొందరు గర్భిణులు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఇది కూడా చూడండి: Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! వ్యాయామం చేయడం ప్రెగ్నెన్సీలో విశ్రాంతి తీసుకోవాలని భావించి పూర్తిగా ఏ పని చేయకుండా కొందరు ఉంటారు. అయితే గర్భిణులకు విశ్రాంతి ఉండాల్సిందే. అదే విధంగా వ్యాయామం కూడా ఉండాలి. మరీ ఎక్కువగా వ్యాయామాలు చేయకుండా తేలిక పాటి వ్యాయామాలు చేస్తుండాలని నిపుణులు అంటున్నారు. రోజూ ఏదో ఒక సమయంలో వ్యాయామం చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కొందరికి నిద్రపట్టదు. అదే వ్యాయామం చేస్తే హాయిగా నిద్ర కూడా పడుతుంది. ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు! ఒత్తిడికి గురి కాకుడదు గర్భిణులు చాలా ఫ్రీగా ఉండాలి. కొందరు ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. దీనివల్ల నిద్రలేమి వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. దీంతో మీ ఆరోగ్యం క్షీణించడంతో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు! రోజూ ఒకే సమయం పాటించకపోవడం కొందరు రోజుకో సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి రోజూ ఒక సమయం పాటించండి. ఉదాహరణకు ఒకే సమయానికి తినడం, నిద్రపోవడం, యోగా, మెడిటేషన్ వంటివి డైలీ ఒకే సమయానికి చేయడం మంచిది. ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.