Periods Pain: ఈ టిప్స్ పాటిస్తే పీరియడ్స్ పెయిన్ క్లియర్! పీరియడ్స్‌లో నొప్పి, అధిక రక్తస్రావంతో బాధపడుతున్నట్లయితే సోంపు, మెంతుల వాటర్ బాగా ఉపయోగపడతాయి. గ్లాసు నీటిలో వీటిని వేసి కాస్త మరిగించి గోరువెచ్చగా తాగితే వెంటనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. వీటి పొడి కలిపిన నీటిని అయిన తాగవచ్చని నిపుణులు అంటున్నారు. By Kusuma 20 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి నెలసరిలో చాలా మంది అమ్మాయిలు పొత్తి కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. దీంతో పాటు కొందరికి అధికంగా రక్తస్రావం కూడా అవుతుంది. దీనివల్ల ఏ పని చేయకుండా రోజంతా నీరసంగా ఉంటారు. పీరియడ్స్‌లో ఆరు నుంచి ఏడు రోజుల వరకు బ్లీడింగ్ అనేది సాధారణమే. కానీ అధికంగా అయితే మాత్రం ప్రమాదమే. ఎక్కువ రోజుల ఇలానే అయితే రక్తహీనత, శ్వాస సమస్య, అలసట వంటి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా 28 రోజులకు నెలసరి వస్తుంది. మరికొందరికి ముందుగా లేకపోతే ఆలస్యంగా వస్తుంది. అయితే పీరియడ్స్ సమయంలో నొప్పి, అధిక రక్తస్రావం నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవేంటో చూద్దాం. ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు! సోంపు గింజల వాటర్‌తో.. పీరియడ్స్ బ్లీడింగ్ నుంచి ఉపశమనం పొందాలంటే సోంపు నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. సోంపు గింజలను డైరెక్ట్‌గా లేదా పౌడర్ చేసుకుని నీళ్లలో మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి తాగితే వెంటనే బ్లీడింగ్ అదుపులో ఉంటుంది. అలాగే పొట్ట కింద ఐస్ ప్యాక్ పెట్టుకున్న కూడా హెవీ బ్లీడింగ్‌ను తగ్గించడంతో పాటు పొత్తి కడుపులో వచ్చే నొప్పి నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. ఈ ఐస్ ప్యాక్ వల్ల గర్భాశయ కండరాలకు రక్త ప్రవాహాం పెరుగుతుంది. దీంతో నొప్పి తగ్గుతుంది. ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా ఒక టేబుల్ స్పూన్ మెంతులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి స్పూన్ తేనెలో కలిపి గోరు వెచ్చగా తాగాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయడం పొత్తి కడుపులో నొప్పి నుంచి విముక్తి పొందుతారు. పీరియడ్స్ సమయంలో తీవ్రంగా నొప్పి వస్తే నిద్రపోవడం మంచిది. నిద్రలోకి వెళ్లిన తర్వాత హార్మోన్ల స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. దీంతో బ్లీడింగ్, నొప్పి తగ్గుతాయి. పీరియడ్స్ సమయంలో అధికంగా రక్తస్రావం అయితే రక్తహీనత సమస్య బారిన పడతారు. ప్రతీ నెల ఇలానే అధికంగా జరగుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇది కూడా చూడండి: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్! #fenugreek-water #life-style #periods-pain మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి