Peanuts: శీతాకాలంలో వేరుశెనగ తినడం వల్ల ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కానీ పురాతన కాలం నుండి వేరుశెనగ తిన్న తర్వాత నీరు తాగొద్దని చెబుతుంటారు. వేరుశెనగ తిన్న తర్వాత నీరు తాగితే అది ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలను చూపుతుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలు:
ఇది కూడా చదవండి: వరంగల్‌లో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ దుర్మరణం
వేరుశెనగ తిన్న తర్వాత నీరు తాగడం మంచిది కాదు. ఈ పొరపాటు వల్ల పేగు ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే వేరుశెనగ తిన్న తర్వాత నీళ్లు తాగడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగ తర్వాత నీరు తాగే అలవాటు శ్వాసకోశాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. అంటే ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు, గొంతు. అంతే కాకుండా బాదం తర్వాత నీళ్లు తాగడం వల్ల కూడా అలర్జీ వస్తుంద వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: చిక్‌పీస్ తింటే షుగర్ తగ్గుతుందా?.. ఇందులో నిజమెంత?
వేరుశెనగ తర్వాత నీరు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్ధకం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటి సమస్యలను కలిగి ఉంటాయి. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేరుశెనగలను సరైన పద్ధతిలో, సరైన మొత్తంలో రోజువారీ డైట్ ప్లాన్‌లో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే అనేక రకాల క్యాన్సర్‌లు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రాత్రి స్వెట్టర్ వేసుకుని నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు