కొందరికి తలనొప్పి, మోకాళ్ల నొప్పులు ఇలా ఏదో ఒక సమస్య రోజూ వస్తుంటుంది. ఈ నొప్పి నుంచి బయటపడటానికి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ముఖ్యంగా సర్జరీ సమయాల్లో అయితే తప్పకుండా పెయిన్ కిల్లర్స్ వాడతారు. వీటిని అధికంగా వాడితే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఈ పెయిన్ కిల్లర్స్ మనిషి ప్రాణాలను కూడా తీసేస్తుంది.
ఇది కూడా చూడండి: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!
రక్త హీనత వచ్చే ప్రమాదం..
చిన్న సమస్యకు పెయిన్ కిల్లర్ వాడితే కిడ్నీలు, లివర్ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు పక్షవాతం, గుండె పోటు, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, మెదడు దెబ్బతినడం వంటి సమస్యల బారిన కూడా పడతారు. కొంతమంది శరీరంలో రక్తం కూడా పలుచబడుతుంది. దీంతో రక్తహీనత వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!
ఎవరికైనా ఏదైనా నొప్పి వస్తే వెంటనే మందుల షాపుకు వెళ్లి తీసుకొచ్చి వేసుకుంటారు. ఇలా డాక్టర్ పర్మిషన్ లేకుండా మందులు తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలా చిన్న నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడితే వాటివల్ల బీపీ పెరగడం, అలసట, మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి చిన్న సమస్యకు కూడా పెయిన్ కిల్లర్స్ అసలు వాడవద్దు.
ఇది కూడా చూడండి: Etela Rajender: రేవంత్ నీ బతుకెంతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్!