కిడ్నీ ఇచ్చిన భార్య.. లివర్ ఇచ్చిన కొడుకు..హైదరాబాద్ లో అరుదైన సర్జరీ!

ఒంగోలుకి చెందిన ఓ 54 ఏళ్ల వ్యాపారవేత్తకు కిడ్నీలతో పాటు కాలేయం పాడైంది. దీంతో చావు బతుకుల్లో ఉన్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేయగా.. కుమారుడు లివర్ లోని కొంత బాగం ఇచ్చాడు. హైదరాబాద్ స్టార్ ఆస్పత్రి వైద్యులు కిడ్నీ, కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు.

New Update
Organ donation

AP NEWS

AP NEWS:అన్ని దానాల్లోకేళ్ల ఆవయవాల దానం చాలా గొప్పది అంటారు. అవయవ దానం అనేది మరణించబోయే వ్యక్తి శరీర అవయవాలు వేరొకరికి అమర్చడానికి ఇవ్వడం. దీని వలన ఆయా అవయవాలు విఫలమై రోగగ్రస్తులైన వారు పునర్జీవితులవుతారు. తాజాగా ఓ కుటుంబం అందరికి ఆదర్శంగా నిలిచారు. ఇంటి పెద్దకు కిడ్నీ, కాలేయం సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఆ కుటుంబం తల్లడిల్లి పోతున్నారు. రెండు కీలక అవయవాలు చెడిపోయిన ఇంటి పెద్దను ఎలగైనా బతికించుకున్న కుటుంబం నిర్ణయించుకుంది. వాటిని ఎవరైనా దానం చేస్తే తప్ప ఆయన అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేరు.

ఇది కూడా చదవండి: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జనవరి నుంచే ఉచిత భోజనం

కుటుంబ సభ్యుల త్యాగం:

అయితే వైద్యులు చెప్పిన మాటలు విన్న కుటుంబ సభ్యులు అతనిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకున్నారు. భార్య, కుమారుడు అవయవాలను దానం చేయాడానికి సిద్ధమైయ్యారు. దీంతో ఆ ఇంటి పెద్ద అనారోగ్య సమస్య నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారు. ఏపీలోని ఒంగోలుకు చెందిన ఓ కుటుంబ సభ్యుల త్యాగం చేసిన తీరుతో అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ విషయంపై నానక్‌రాంగూడలోని స్టార్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు వెలిపారు.  

ఒంగోలుకి చెందిన వ్యాపారవేత్త 54 ఏళ్ల రామారావు కాలేయం, కిడ్నీ  సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. అతేకాకుండా ఇతనికి మధుమేహం, అధిక రక్తపోటు, హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాలేయం పూర్తిగా చెడిపోగా.. కిడ్నీలు ఫెయిల్‌ అవ్వడంతో రక్తంలో విష పదార్థాలు పేరుకుపోయాయని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు అతనిని స్టార్‌ ఆస్పత్రిలో జాయిన్ చెపించారు. రామారావును పరీక్షించిన డాక్టర్లు వెంటనే కాలేయం, మూత్రపిండాలను మార్చాలని చెప్పారు.  దీంతో అతని భార్య నాగవల్లి, కొడుకు కౌశిక్‌ అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాగవల్లి నుంచి కిడ్నీని, కౌశిక్‌ కాలేయం నుంచి కొంత భాగం తీసి రోగికి అమర్చారని స్టార్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  ఇంటి పెద్దను బతికించుకోన్న  కుటుంబం సాహనం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: క్రిస్మస్‌కి పిల్లలకు ఈ బహుమతులు ఇవ్వండి

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు

Advertisment
తాజా కథనాలు