Nita Ambani: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్టైల్, ఫ్యాషన్ పరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. 60 ఏళ్ల వయసులోనూ ఆమె ఫ్యాషన్ సెన్స్ తో అవాక్కయేలా చేస్తుంటారు. ఏ పార్టీ నిర్వహించిన.. అందరీ చూపు ఆమె వస్త్రాలంకరణ పైనే ఉండేలా ఉంటుంది నీతా ఫ్యాషన్ సెన్స్. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లోనూ భిన్నంగా కనిపించారు. ఈ పార్టీలోని నీతా అంబానీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. జామ్ నగర్ లో నిర్వహించిన ఈ పార్టీకి చాలా మంది సెలెబ్రెటీలు హాజరయ్యారు.
Also Read: RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ !
ధర రూ.1.54 లక్షలు
ఈ పార్టీలో నీతా డిజైనర్ లేబుల్ ఆస్కార్ డి లా రెంటా నుంచి బంగారు రంగులో మెరిసే కఫ్తాన్ స్టైల్ గౌను ధరించింది. లామో ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ఈ గౌను ధర రూ. 1. 54 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. నీతా సింపుల్ లుక్‌లో కూడా రిచ్‌గా కనిపిస్తుంది . ఐవరీ నెక్ లైన్ , స్లీవ్ ప్రాంతంలో అందమైన క్రిస్టల్ వర్క్ తో సింపుల్ గౌన్ కు కాస్ట్లీ టచ్ అందించారు. డైమండ్ డ్రాప్ చెవిపోగులు, ఉంగరం నీతా అంబానీ అందాన్ని మరింత పెంచాయి. వీటితో పాటు మెరిసే హీల్స్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ గా కనిపించాయి.
Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!