Nagula Chavithi 2025: నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం .. శివలింగంపై పడగవిప్పిన పాము!

నాగులచవితి రోజు అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. శివలింగంపై రెండు పాములు పడగవిప్పి నిల్చున్నాయి.  నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో ఈ అద్భుత ఘటన వెలుగుచూసింది.

New Update
Nagula Chavithi 2025

Nagula Chavithi 2025

Nagula Chavithi 2025: నాగులచవితి రోజు అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. శివలింగంపై రెండు పాములు పడగవిప్పి నిల్చున్నాయి.  నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో ఈ అద్భుత ఘటన వెలుగుచూసింది. నాగుల చవితి సందర్భంగా ఉదయం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా గుడి ప్రాంగణంలోని రెండు పాములు శివలింగంపైకి చేరుకొని పడగవిప్పి నిల్చున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. 

Also Read: ఉదయం 30 సెకన్ల హగ్‌తో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

కార్తీక మాసం(Month of Kartika) శుక్ల పక్షం తిథి రోజు నాగుల చవితి పండుగ వస్తుంది. ఈ రోజున నాగులను పూజించడం, వాటికి పాలు పోయడం ద్వారా కుటుంబంలోని సుఖశాంతులు, సంతాన సౌభాగ్యం, వ్యాధి భయాలు, సర్పదోషాల నివారణ లభిస్తాయని భక్తులు నమ్ముతారు. నాగులు హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి.

నాగుల చవితి రోజు పాలు పోసే విధానం

పాము పుట్టలో కొద్దిగ పాలను పోసి, మిగిలిన పాలను నైవేద్యంగా భగవంతుని పూజకు సమర్పిస్తారు. “దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనే శాస్త్ర వాక్యంతో, పాములు పాలు తాగుతాయనే అపోహను తొలగిస్తూ, భక్తులకు ఆనందం, శాంతి లభిస్తుందని అర్థంతో ఈ మంత్రాన్ని జపిస్తారు. పాలు శుద్ధి, శాంతికి ప్రతీక. పంచామృతంలో పాల, పెరుగు, నెయ్యి ముఖ్య పాత్ర పోషిస్తాయి. పాలు, పెరుగుతో వివేకం, సుఖం, సమాజ సహకారం, త్యాగం, భోగం వంటి సద్గుణాలను పొందవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయి. 

Also Read: Rashmika Post: నా గుండె పగిలింది.. కర్నూల్ బస్ ప్రమాదంపై రష్మిక కన్నీటి పోస్ట్!

Advertisment
తాజా కథనాలు