/rtv/media/media_files/2025/10/25/rashmika-2025-10-25-10-22-16.jpg)
rashmika
Rashmika Post: కర్నూల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి రష్మిక మందన్న ఈ ఘటనపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. కర్నూల్ ప్రమాద వార్త విని నా గుండె ముక్కలైంది! నా మనసు ఎంతో కలత చెందింది. మంటల్లో కాలుతున్న ఆ బస్సు లోపలి ప్రయాణికుల బాధ వర్ణనాతీతం. కాలిపోయే ముందు వాళ్ళ బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ ప్రమాదంలో చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబం అంతా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నటి రష్మిక.
/filters:format(webp)/rtv/media/media_files/2025/10/25/rashmika-2025-10-25-10-20-16.png)
Also Read: Akhanda 2: సౌండ్ కంట్రోల్ పెట్టుకో.. 'అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్! గూస్ బంప్స్ వీడియో
Follow Us