వంటింట్లో ఉండే పోపుల డబ్బాలో తప్పకుండా మసాలా దినుసులు ఉంటాయి. అందులో ఆవాలు ఒకటి. వీటిని తప్పకుండా కూరల్లో వాడుతుంటారు. వీటిని వంటల్లో వాడటం వల్ల కూరలకు కేవలం టేస్ట్ మాత్రమే రాకుండా.. ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది. అయితే ఈ ఆవాలతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చూడండి: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! రక్తపోటు నుంచి విముక్తి.. ఆవాలలో ఉండే ఔషధ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆవాలను ఎక్కువగా కూరల్లో, పచ్చడిలో వాడుతుంటారు. ఏదో విధంగా వీటిని బాడీకి తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటు నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్ డైలీ ఆవాలను వంటల్లో ఉపయోగించడం వల్ల కాలేయ సమస్యలు క్లియర్ అవుతాయి. అలాగే చర్మ ఆరోగ్యం, జుట్టు కూడా బలంగా ఉంటాయి. చర్మంపై ఉండే ముడతలు, మొటిమలు అన్ని తొలగి యవ్వనంగా కనిపిస్తారు. ఆవాలలో ఉండే పోషకాలు సోరియాసిస్ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే! ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరనివ్వకుండా చేస్తాయి. ప్రమాదకరమైప క్యాన్సర్ తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులోని పొటాషియం, కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు కీళ్ల సమస్యలను క్లియర్ చేస్తాయి. కేవలం ఆవాలు మాత్రమే కాకుండా ఆవాల నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆవాల నూనెలో పసుపు వేసి చర్మానికి అప్లై చేస్తే స్కిన్ మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.