/rtv/media/media_files/2025/07/05/monsoon-bike-riding-tips-in-telugu-2025-07-05-20-37-59.jpg)
monsoon bike riding tips in telugu
వర్షాకాలం మనసుకు హాయిగా ఉన్నా.. రోడ్లపై బైక్ నడిపే వారికి మాత్రం సవాళ్లతో కూడుకున్నది. తడిసిన రోడ్లు, గుంతల కారణంగా వర్షాకాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వర్షంలో కూడా సురక్షితంగా ప్రయాణించవచ్చు. అందువల్ల వర్షాకాలంలో బైక్ ప్రయాణాన్ని సురక్షితంగా, సుఖంగా మార్చుకోవాలంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
rainy season bike riding tips
వేగం తగ్గించి నెమ్మదిగా వెళ్ళడం:
వర్షాకాలంలో ‘నిదానమే ప్రధానం’ అనే సూత్రాన్ని పాటించాలి. తడి రోడ్లపై బైక్ టైర్లు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వేగాన్ని 30-40 kmph మధ్య ఉండేలా చూసుకోవాలి. వేగం తక్కువగా ఉంటే సడెన్ బ్రేకులు వేయాల్సి వచ్చినా లేదా స్కిడ్ అయినా బైక్‌ను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
బ్రేకులను జాగ్రత్తగా వాడటం:
తడి రోడ్లపై సడన్ బ్రేకులు వేయడం వల్ల బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల వర్షాకాలంలో వెళ్లేటప్పుడు ముందు, వెనుక బ్రేకులను ఒకేసారి నెమ్మదిగా నొక్కి పట్టుకోవాలి. దీని ద్వారా బైక్‌ను ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ సమయంలో గేర్ తగ్గించడం కూడా ఈజీ అవుతుంది.
Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!
ఇతర వాహనాలతో దూరం పాటించడం:
వర్షంలో ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేకులు వేసినప్పుడు ఆగిపోవడానికి తగినంత దూరం ఉండాలి. సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ దూరం పాటించాలి.
రోడ్డుపై గుంతల పట్ల జాగ్రత్త:
వర్షపు నీటితో నిండిన గుంతల లోతు అంచనా వేయడం కష్టం. అవి ప్రమాదకరమైనవి కావచ్చు. అందువల్ల గుంతలు ఉన్న రోడ్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే, వేగాన్ని బాగా తగ్గించి జాగ్రత్తగా వెళ్ళాలి.
Also Read : రూ. 20వేలలో బెస్ట్ స్మార్ట్‌టీవీలు - మార్కెట్లో దుమ్మురేపుతున్న మోడల్స్ ఇవే!!
లైట్లను ఆన్ చేయాలి:
పగటిపూట వర్షం పడుతున్నప్పుడు బైక్ హెడ్‌లైట్లు (లో-బీమ్), టెయిల్ లైట్లు, ఇండికేటర్లు ఆన్ చేయాలి. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలకు మీ బైక్ ఉనికిని తెలియజేస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.
టైర్లు, బ్రేకులు తనిఖీ చేయాలి:
వర్షాకాలం ప్రారంభం కాకముందే బైక్ టైర్ల ట్రెడ్ (గ్రిప్) సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. అరిగిపోయిన టైర్లు వర్షంలో జారిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో సర్వీసింగ్ చేయించుకోవాలి.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా వర్షాకాలంలో మీ బైక్ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.