Viral Video: వీడేం మనిషిరా బాబూ.. ప్రాణాల కంటే మందే ముఖ్యమా? యూకేలో ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి లేచి మద్యం తాగేందుకు పబ్‌లోకి వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. పబ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని, మద్యం సేవించి ఎంచక్కా అంబులెన్స్ ఎక్కి ఆస్పత్రికి వెళ్లాడని పబ్ యజమాని చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 in లైఫ్ స్టైల్ వైరల్ New Update Viral Video షేర్ చేయండి Viral Video: విదేశాల్లో ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఏమైందో ఏమో అంటూ అంతా కంగారుపడ్డారు కానీ. ఒక్కసారిగా ఆ వ్యక్తి లేచి మద్యం తాగేందుకు పబ్‌లోకి వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. యూకేలో CCTV కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఆశ్చర్యకరమైన సంఘటనలో డబుల్ డెక్కర్ బస్సు 53 ఏళ్ల సైమన్ స్మిత్ అనే వ్యక్తిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత చాలా దూరం వరకు ఎగిరిపడ్డాడు. పబ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని.. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్మిత్ మామూలుగా లేచి పక్కనే ఉన్న పబ్‌లోకి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అప్పటికే కొందరు అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చేసరికి వ్యక్తి పబ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని, మద్యం సేవించి ఎంచక్కా అంబులెన్స్ ఎక్కి ఆస్పత్రికి వెళ్లాడని పబ్ యజమాని అంటున్నాడు. అయితే ఈ సంఘటన చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు. The man who got hit by a bus and immediately went back to the pub is strong!Beer is very important. pic.twitter.com/mVccw3mx3h — Figen (@TheFigen_) October 31, 2024 బస్సు ఢీకొన్నా బీర్ కోసం వెళ్లిన ధైర్యాన్ని కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం ప్రాణాల కంటే మందే ముఖ్యమైందా అంటూ సీరియస్ అవుతున్నారు. మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. అతనికి జీవితంలో రెండు అవకాశాలు వచ్చాయి.. ఒకటి ప్రాణం మళ్లీ తిరిగి వస్తే..మరొకటి మందుతాగే అవకాశం దొరికిందంటూ సెటైర్లు వేస్తున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: పొత్తి కడుపుకి మసాజ్ చేస్తే కలిగే లాభాలు ఇది కూడా చదవండి: వేడి నీటిలో పాదాలు ఉంచితే మైగ్రేన్ పోతుందా? #viral మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి