Massage: పొత్తి కడుపుకి మసాజ్‌ చేస్తే కలిగే లాభాలు

తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల వీపుపై, పొట్టకు బాగా మసాజ్ చేస్తుంటారు. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం, ఒత్తిడి, ఉబ్బరం, గ్యాస్‌ తగ్గటం, జీర్ణక్రియను మెరుగుపడి.. జీర్ణ వ్యవస్థకు మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Abdominal Massage

Massage

Abdominal Massage: పొత్తికడుపుకు మసాజ్ చేయడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. కడుపుకు మసాజ్ చేయడం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. చిన్నప్పటి నుంచి పిల్లల వీపుపై మసాజ్ చేస్తుంటారు. పొట్టకు కూడా తల్లిదండ్రులు బాగా మసాజ్ చేస్తుంటారు. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం, ఒత్తిడి కూడా తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుకు మసాజ్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచి ఉపశమనం కలుగుతుంది. 

రోగులకు కడుపుకు మసాజ్ చేయడం వల్ల:

  • జీర్ణ క్రియను సంక్రియం చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం లాంటి సమస్యలు ఉండవు. పొత్తికడుపుకు మసాజ్ చేయడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పేగు కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గిస్తుంది. చాలామందికి తరచుగా జీర్ణ వ్యవస్థ మందగిస్తుంటుంది. అంతేకాకుండా కడుపులో విపరీతమైన గ్యాస్ పేరుకు పోతుంది. కడుపుకు మసాజ్ చేయడం వల్ల గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. పేగు సిండ్రోమ్‌తో బాధపడుతున్న రోగులకు కడుపుకు మసాజ్ చేయడం వల్ల సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

మలబద్ధకాన్ని తొలగిస్తుంది:

  • ప్రస్తుత కాలంలో చాలామంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి పొత్తికడుపుకు ప్రతిరోజు మసాజ్ చేయడం వల్ల పేగు పనితీరు మెరుగుపడుతుంది. పేగులు కూడా శుభ్రపడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి- విశ్రాంతి:

  • బ్యాక్ మసాజ్ ఒత్తిడిని తగ్గించినట్లే పొత్తికడుపుకు మసాజ్ చేయడం వల్ల కూడా ప్రశాంతత కలుగుతుంది. ఉదర భాగం ఫ్రీ అవుతుంది. దీనివల్ల మెదడులోని నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగాయి అనడానికి సంకేతాలు ఇవే

 

 

ఇది కూడా చదవండి: దీపావళికి చూడాల్సిన అందమైన ప్రదేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు