Mahalaya Amavasya 2025: మరో 5 రోజుల్లో మహాలయ అమావాస్య.. చాలా పవర్ ఫుల్.. ఆ రోజు ఏం చేయాలో తెలుసా..?

ఏడాది సెప్టెంబర్ 21న ఈ అమావాస్య ఆదివారం నాడు రావడం విశేషం. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి శ్రద్ధా క్రియ, నువ్వుల నీటితో తర్పణం చేయడం తప్పనిసరి. పవిత్ర నదుల్లో స్నానం చేస్తే 116 రెట్ల ఎక్కువ ఫలితాలు లభిస్తాయని పండితులు సూచించారు.

New Update
_Mahalaya Amavasya 2025

Mahalaya Amavasya 2025

మహాలయ అమావాస్య అనేది హిందూ క్యాలెండర్‌లో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు పితృ పక్షం ముగింపును సూచిస్తుంది. ఇది సాధారణంగా సెప్టెంబర్ నెలలో వస్తుంది. ఈ రోజున మనం చనిపోయిన పూర్వీకులకు, బంధువులకు తర్పణం, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తాం. ఈ కర్మల ద్వారా వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటాం. ఈ రోజున చేసే దానధర్మాలు, పూజలు పుణ్యఫలితాలని ఇస్తాయని నమ్ముతారు. అయితే భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఈ అమావాస్య ఆదివారం నాడు రావడం విశేషం.  పితృదేవతలకు ప్రత్యేక రోజు అయిన మహాలయ అమావాస్య గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఫలితాలు అధికం..

పండితుల అభిప్రాయం ప్రకారం.. అమావాస్య ఆదివారం రోజున వస్తే ఆ రోజు చేసే పూజలు, దానాలు అత్యంత శుభప్రదమని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున పితృదేవతలతో పాటు శివ, విష్ణు దేవుళ్లను కూడా పూజిస్తారు. పూర్వీకులకు తర్పణాలు, పిండ ప్రదానాలు సమర్పించడం ద్వారా వారి పాపాలు తొలగి, సంతానానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాలయ అమావాస్య నాడు పూర్వీకులకు సమర్పించిన ఆహారాన్ని వారు స్వీకరించి, ఆశీర్వదిస్తారని పండితులు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: నేడే చంద్రగ్రహణం.. ఏ రాశిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా..?

ఈ రోజున శివారాధన చేయడం వల్ల సకల సమస్యలు తొలగి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే విష్ణు పూజలు మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం, ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. మరణించిన కుటుంబ సభ్యుల ఆత్మ శాంతి కోసం ఈ రోజు పూజలు నిర్వహించడం శుభప్రదం. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి శ్రద్ధా క్రియ, నువ్వుల నీటితో తర్పణం చేయడం తప్పనిసరి. పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల ఇతర రోజులతో పోలిస్తే 116 రెట్ల ఎక్కువ ఫలితాలు లభిస్తాయని పండితులు సూచించారు. ఈ అరుదైన, శక్తివంతమైన రోజున పితృ కార్యాలను శ్రద్ధగా నిర్వహించాలని సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: ఈ నెలలోనే సూర్యగ్రహణం.. డేట్, టైమ్, రాశులపై ప్రభావం.. తదితర వివరాలివే

Advertisment
తాజా కథనాలు