/rtv/media/media_files/2025/04/09/UfkxlzUsUFfBz2TicWuL.jpg)
expectant parents tips
Parent Guide: సాధారణంగా స్త్రీలకు ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఎంతో కష్టమైన, ఇష్టమైన ప్రక్రియ. ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా కడుపులో పిండం పెరుగుతున్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది బిడ్డ మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో అలవర్చుకోవాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
బ్యాలన్స్డ్ డైట్
గర్భధారణ సమయంలో ఆహరం, ఆహారపు అలవాట్ల పై ప్రత్యేక శ్రద్ద వహించాలి. బిడ్డకు అన్ని పోషకాలు అందేలా సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పల్సెస్, తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి. తద్వారా తల్లి, బిడ్డ ఇద్దరికీ పోషకాలు లభిస్తాయి.
మంచి నిద్ర
ప్రతిరోజూ 7-9 గంటల నాణ్యమైన నిద్ర తప్పసరిగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో సరైన నిద్ర లేకపోవడం శారీరక , మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరం.
స్వీయ సంరక్షణ
కాబోయే తల్లిదండ్రులు విశ్రాంతి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలకు సమయం కేటాయించాలి. ఇవి లోపల బిడ్డపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు బుక్స్ చదవడం, స్నేహితులతో సమయం గడపడం వంటివి చేయాలి.
కుటుంబంతో సమయం
కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు. అలాగే కాబోయే తల్లిదండ్రులకు, పుట్టబోయే బిడ్డకు మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుంది.
శారీరక శ్రమ
చాలా మంది గర్భధారణ సమయంలో ఎక్కువగా పడుకోవడం లేదా కూర్చోవడం చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు. ప్రతిరోజు కొంత సమయం తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్ చేయడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి, బరువును నిర్వహించడంలో కూడా తోడ్పడతాయి.
telugu-news | latest-news | life-style | parent-guide
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.