Paneer Health: నకిలీ పన్నీర్ విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో స్వచ్ఛమైనది గుర్తించండి

ప్రస్తుతం మార్కెట్లట్లో కల్తీ విపరీతంగా పెరిగిపోయింది. ఇలా కల్తీ అవుతున్న అనేక పదార్థాలలో పన్నీర్ ఒకటి. అయితే నిజమైన పన్నీర్, నకిలీ పన్నీర్ మధ్య తేడాను గుర్తించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
paneer health

paneer health

Paneer Health:  ఈరోజుల్లో మార్కెట్లో కల్తీ పదార్థాల విక్రయం పెరిగిపోయింది. తాగే నీటి నుంచి తినే తిండి వరకు ఎక్కడో ఒక చోట కల్తీ జరుగుతూనే ఉంది. ఇలా కల్తీ అవుతున్న అనేక పదార్థాలలో పన్నీర్ ఒకటి. పన్నీర్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. శాకాహారులు ప్రోటీన్ కోసం మొదటగా దీనినే ఎంచుకుంటారు. అయితే ఈరోజుల్లో స్వచ్ఛమైన పన్నీర్ దొరకడం చాలా కష్టమై పోయింది. మార్కెట్లలో లభించే కల్తీ పన్నీర్ ఆరోగ్యానికి విషం కంటే తక్కువేమి కాదు. దీనివల్ల చాలా మంది పన్నీర్ తినాలంటే అయోమయంలో పడుతున్నారు. నకిలీ ఏది? స్వచ్ఛమైనది ఏదీ అనేది గుర్తించలేకపోతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు ద్వారా నకిలీ, స్వచ్ఛమైన పన్నీర్ ను గుర్తించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

స్వచ్ఛమైన పన్నీర్ ఇలా గుర్తించండి 

  • పన్నీర్ కొనడానికి ముందు  రంగును జాగ్రత్తగా గమనించండి. తెలుపు లేదా ఆఫ్-వైట్ రంగులో ఉంటే స్వచ్ఛమైనది. లేత గులాబీ లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తే కొనడం మానేయండి. అది నకిలీ పన్నీర్ కావచ్చు. స్వచ్ఛమైన పన్నీర్ తినడానికి పుల్లగా ఉండదు. దాని వాసన తేలికగా ఉంటుంది. 
  • ఎలాంటి నీరు, నూనె లేకుండా ఒక పన్నీర్ ముక్కను పాన్ లో వేయించండి. స్వచ్ఛమైన పన్నీర్ తేమను విడుదల చేస్తుంది. అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది. నకిలీ పన్నీర్ వేడి చేసిన వెంటనే విరిగిపోతుంది. నీరు బయటకు రాదు. 
  • పన్నీర్ కొనేటప్పుడు వేళ్ళతో కాస్త విరిచి చూడండి. మరీ మెత్తగా ఉండకూడదు. అలాగే పన్నీర్ ఆకృతి గట్టిగా ఉంటుంది. కానీ మృదువైనది అని గుర్తుంచుకోండి. మరీ గట్టిగా దుర్వాసన వచ్చే పన్నీర్ ను కొనకండి. 
  •  పనీర్ స్వచ్ఛతను తనిఖీ చేయడానికి, ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి. దానిలో ఒక చిన్న ముక్క వేయండి.  స్వచ్ఛమైన పనీర్ నీటిలో మునిగిపోతుంది. అలాగే  పగలదు.  కల్తీ పనీర్ నీటిలో కరిగిపోవచ్చు లేదా పగిలిపోవచ్చు.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు