/rtv/media/media_files/2025/02/04/olive-oil-effects-for-health.jpeg)
గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఆలివ్ నూనె డిమాండ్ బాగా పెరిగింది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. అంతేకాదు ఇందులో గుండెకు మేలు చేసే మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
/rtv/media/media_files/2025/02/04/olive-oil-using.jpeg)
అయితే అతిగా శుద్ధి చేసిన ఆలివ్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది దాని ప్రయోజనాలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రకమైన ఆయిల్ తీసుకోవడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోయి.. చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రాంభమవుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
/rtv/media/media_files/2025/02/04/oilve-health-effects.jpeg)
ఆలివ్ నూనెలో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షించడానికి, హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి. కానీ.. ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడడం వల్ల మొహంపై రంధ్రాలు మూసుకుపోతాయి.
/rtv/media/media_files/2025/02/04/olive-oil-side-effects.jpeg)
ఈ రంధ్రాలు మూసుకుపోయినప్పుడు వాటిలో బ్యాక్టీరియా పేరుకుపోయి మొటిమలు, ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్, మొటిమల బారిన పడే చర్మం ఉన్నవారు ఆలివ్ నూనెను అతిగా అప్లై చేసుకోవడం మానుకోవాలి.
/rtv/media/media_files/2025/02/04/oilve-health.jpeg)
సాధారణంగా ఆలివ్ ఆయిల్ అధిక ఉష్ణోగ్రత, పీడనం కింద శుద్ధి చేయబడుతుంది. దీనివల్ల నూనెలోని ఒమేగా-3 ఆమ్లాలు బర్న్ అయిపోతాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
/rtv/media/media_files/2025/02/04/olive-oil-side-effects.jpeg)
ఈ రకమైన ఆలివ్ నూనెను తీసుకోవడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అంతేకాదు దీని అధిక వినియోగం గుండె సమస్యలు, హైపోగ్లైసీమియా, జీర్ణ సమస్యలు , బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది.
/rtv/media/media_files/2025/02/04/olive-oil-using.jpeg)
ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. ప్రమాదాలను నివారించడానికి మితంగా తీసుకోవాలి. అలాగే అధిక నాణ్యత, శుద్ధి చేయని రకాలను ఎంచుకోవడం ముఖ్యం.
/rtv/media/media_files/2025/02/04/AXecev0ikgtFAgh5MsBe.jpg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.