/rtv/media/media_files/2025/04/19/VZGAcVnWZs6fAhRlRLH9.jpg)
Latest Studies found CT Scan Cause Cancer
CT Scan ప్రస్తుత జనరేషన్ లో CT స్కాన్ అనేది (Computed Tomography) ఆరోగ్య పరీక్షల్లో ముఖ్యమైన భాగం. ఇది శరీరాన్ని లోపలి నుంచి స్కాన్ చేసి క్యాన్సర్, గాయాలు, రక్తస్రావం, స్ట్రోక్ లాంటి సమస్యలు గుర్తించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది.
CT స్కాన్ తో క్యాన్సర్
అయితే, తాజాగా పరిశోధనల్లో CT స్కాన్లు ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరిగే ప్రమాదం ఉందని వెల్లడైంది. CT స్కాన్ సమయంలో విడుదలయ్యే (ionising radiation) వల్ల DNAకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇది కాలక్రమేణా క్యాన్సర్‌కు దారితీయవచ్చు. JAMA Internal Medicine అనే అధ్యయనంలో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2023లో అమెరికాలో నిర్వహించిన CT స్కాన్లు వల్ల.. భవిష్యత్తులో సుమారు 1,00,000 క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. గత 10 ఏళ్లలో అమెరికాలో CT స్కాన్లు 30 శాతం పెరిగాయి. ప్రతి ఏడాది కొత్తగా వచ్చే క్యాన్సర్లలో సుమారు 5% CT స్కాన్ల వలన రావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. చిన్నపిల్లల కంటే పెద్దవారిలో CT స్కాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే 90% పెద్దవారికే స్కాన్లు ఎక్కువగా చేస్తారు. సాధారణంగా వైద్యులు చిన్నపిల్లలకు స్కాన్లు ఎక్కువగా సిఫార్సు చేయరు.. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్పా! ఒక్కసారి సిటీ స్కాన్ చేయించడం వల్ల రిస్క్ తక్కువే అయినా.. తరచూ చేయించడం ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎక్కువగా ప్రభావితమయ్యే క్యాన్సర్లు
CT స్కాన్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ల్యూకీమియా, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.
అత్యధిక రిస్క్ ఉన్న స్కాన్లు
- చిన్నపిల్లల్లో: తలకు సీటీ స్కాన్.. ముఖ్యంగా 1 సంవత్సరం లోపు పిల్లలకు
- పెద్దలలో: అబ్డమెన్ (కడుపు), పెల్విస్ స్కాన్లు
సురక్షిత పద్ధతులు
ఒకవేళ ఆప్షన్ ఉంటే.. వైద్యుల సలహా మేరకు సీటీ స్కాన్ బదులుగా MRI స్కాన్, అల్ట్రాసౌండ్, Photon-counting CT వాడవచ్చు. వీటిలో రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. CT స్కాన్లకు ప్రాణాలు కాపాడే సామర్థ్యం ఉంది. కానీ రిస్క్ తగ్గించాలంటే అవసరమైనప్పుడే వాడాలి.
telugu-news | life-style | health | cancer
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.