/rtv/media/media_files/Sq434ddM3xjpywe3UxQ4.jpeg)
పోషకాహార నిపుణుల ప్రకారం.. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం సహజంగానే ఏదో ఒకటి తినాలని కోరుకుంటుంది. అయితే ఈ సమయంలో జంక్ ఫుడ్ తినడం ద్వారా దాని రుచి సంతోషకరమైన అనుభూతుని కలిగిస్తుంది. అందువల్ల స్ట్రెస్ లో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలుగుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/health-wellness_health-centers_children_balancing-fast-food-and-healthy-food_2716x1810_25639001.jpg)
అయితే జంక్ ఫుడ్ బ్రెయిన్లోని రివార్డ్ సెంటర్లను యాక్టివేట్ చేస్తుంది. దీని ద్వారా సంతోషానికి కారణమైన డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇది తాత్కాలిక ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
/rtv/media/media_files/2024/11/20/junkfood2.jpeg)
అలాగే జంక్ ఫుడ్ లోని అధిక చక్కెరలు, కొవ్వులు నోటికి మంచి రుచిని అందించడంతో పాటు తాత్కాలిక ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల మనసు కాస్త సంతృప్తి చెందుతుంది.
/rtv/media/media_files/stressll2.jpeg)
ఇలా మనసు సంతృప్తి చెందినప్పుడు శరీరంలో హ్యాపీ హార్మోన్లు (సెరోటోనిన్) ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వారా ఒత్తిడి నుంచి తాత్కాలి ఉపశమనం కలుగుతుంది.
/rtv/media/media_files/46MvLt06yQ2OVvlUQv3w.jpg)
అయితే ఒత్తిడిలో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తినడం ద్వారా తాత్కాలిక ఉపశమనం కలిగినప్పటికీ.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/stresshh2.jpeg)
వాటిలోని హై కొలెస్ట్రాల్ జీర్ణ వ్యవస్థలోని గట్ బ్యాక్టీరియా మనుగడకు అంతరాయం కలిగిస్తుంది. ఈ పరిస్థితి అనేక రోగాలకు దారితీస్తుంది. అంతేకాదు జంక్ ఫుడ్స్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందట.
/rtv/media/media_files/stressgg2.jpeg)
దీర్ఘకాలంపాటు ఇలా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఊబకాయం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇలాంటి అనారోగ్యపు ఆహారపు అలవాట్ల కారణంగా తరచుగా ఆందోళన, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-01T185635.398.jpg)
అధిక రక్తపోటు, అధిక బరువు, మధుమేహం, రక్త నాళాల్లో ఆటంకాలు వంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గుండెపోటుకు కూడా కారణం కావచ్చు.