/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/exhausted-stressed-young-woman-sitting-on-sofa-at-2022-11-15-04-06-07-utc-scaled.webp)
tiered
Life Style: జీవన శైలి విధానాలు, ఆహరపు అలవాట్ల కారణంగా కొంతమందికి ఏ పని చేయకపోయినా నీరసం, అలసట, చిరాకుగా ఉంటుంది. ఇలా ఎటువంటి కారణం లేకుండా అలసటగా అనిపిస్తే ఆశ్రద్ధ వహించకండి. ఇది కొన్ని అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. కష్టపడకుండా అలసిపోవడానికి గల కారణాలను ఇక్కడ తెలుసుకోండి.
ఆరోగ్య సమస్యలు
తరచూ అలసిపోయినట్లుగా అనిపించడం అనేక ఆరోగ్య సమస్యలతో ముడుపడి ఉంటుంది. స్లీప్ అప్నియా, హైపోథైరాయిడిజం, క్యాన్సర్, మల్టిపుల్ స్క్లెరోసిస్, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్, డయాబెటిస్ వంటి సమస్యలు అలసటకు దారితీస్తాయి. ఈ సమస్యలకు చికిత్స చేసినప్పుడు, అలసట సమస్య తగ్గుతుంది.
పోషకాహారా లోపం
పోషకాహారా లోపం కూడా అలసటకు దారితీస్తుంది. ఇనుము, మెగ్నీషియం, విటమిన్లు, ఖనిజాల లోపాలు అలసటకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. వయస్సు పెరిగేకొద్దీ, జీవక్రియ, ఆక్సిజన్ పంపిణీకి అవసరమయ్యే విటమిన్ B12 ను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో అలసట సమస్య ఏర్పడుతుంది.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఒత్తిడి
ఒత్తిడి అలసట, చిరకాకు దారితీయవచ్చు. రోజు వ్యాయామం, యోగా, వాకింగ్ చేయడం ద్వారా ఒత్తిడి సంబంధిత సమస్యలను తగ్గించవచ్చు. అలాగే మ్యూజిక్, బుక్స్ చదవడం కూడా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
నిద్ర లేకపోవడం
మంచి ఆరోగ్యానికి నాణ్యమైన, మంచి నిద్ర చాలా అవసరం. నిద్రించే సమయంలో మెదడు శరీరానికి అవసరమయ్యే గ్రోత్ హార్మోన్లను విడుదల చేస్తుంది. అందువల్ల ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలని వైద్యులు సూచిస్తారు. నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల అలసటగా అనిపిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?