Irregular periods: పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? ఈ ఆహారాలు తీసుకోండి

క్రమరహిత పీరియడ్స్ సమస్యతో బాధపడేవారు ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.  అనాస పండు, మెంతులు, బొప్పాయి, అల్లం వేరు వంటి ఆహారాలు నెలసరి క్రమంగా రావడానికి సహాయపడతాయి.

New Update
Irregular periods

Irregular periods

Irregular periods: ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది స్త్రీలు క్రమరహిత పీరియడ్ సమస్యను ఎదుర్కుంటున్నారు. కొన్ని సార్లు ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, పీసీఓడీ  కూడా దీనికి కారణం కావచ్చు. అయితే ఇలా క్రమరహిత పీరియడ్స్ సమస్యతో బాధపడేవారు ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

క్రమరహిత పీరియడ్స్ నివారించే ఆహారాలు 

అల్లం వేరు

 అల్లం వేర్లు కూడా పీరియడ్స్ సమస్యను నివారించడానికి సహాయపడతాయి.  అల్లం గర్భాశయం సంకోచించబడటానికి ప్రేరేపించడంలో సహాయపడుతుంది.  ఇది క్రమరహిత ఋతుచక్రానికి తొలగించడంలో సహాయపడుతుంది.

 అనాస పండు

పైనాపిల్‌లో పీరియడ్స్ సమయంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే పీరియడ్స్ సరైన సమయంలో రావడానికి తోడ్పడుతుంది. 

Also Read: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

ఖర్జూరాలు 

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖర్జూరాలు శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడతాయి. ఇది మీ గర్భాశయం కారణమై  ఋతుస్రావం సకాలంలో పొందడానికి సహాయపడుతుంది.

Irregular periods tips
Irregular periods tips

ఇది కూడా చూడండి: Pareshan Boys Imran: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!

 

మెంతులు

పీరియడ్స్ ఆలస్యం అయ్యే వారు మెంతులు తినాలని నిపుణులు సూచిస్తారు.  మెంతులు  ఋతుచక్రాల వ్యవధిని నియంత్రించడంలో ఋతుక్రమ నొప్పిని నివారించడంలో సహాయపడతాయి.

బొప్పాయి

బొప్పాయిలో కెరోటిన్,   పపైన్ అనే ఎంజైములు ఉంటాయి.  ఇవి ఋతుస్రావం సమయంలో రక్త ప్రసరణకు సహాయపడతాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. telugu-news | latest-news | life-style | health

ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు