Rainy Season: వర్షాకాలంలో ఈ కూరలు తిన్నారో.. వామ్మో మీ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్లే!

వర్షా కాలంలో ఆకు కూరలు తినడం వల్ల మలేరియా, డెంగీ, విరేచనాలు, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో వీటిని తినకపోవడం మంచిదని నిపణులు అంటున్నారు. ఒకవేళ తింటే ఉప్పు వాటర్‌లో కడిగిన తర్వాతే తినడం మంచిదని చెబుతున్నారు.

New Update
leaf vegetables

leaf vegetables

Rainy Season: ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఏ సీజన్‌లో అయినా వీటిని ఎక్కువగా తీసుకుంటారు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు అంటుంటారు. అయితే మిగతా సీజన్లతో పోలిస్తే వర్షా కాలంలో ఆకు కూరలు తినకూడదని నిపుణులు అంటున్నారు. వీటిలో ఎంత పోషకాలు ఉన్నా కూడా అనారోగ్యాన్ని తెచ్చి పెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వర్షా కాలంలో ఆకు కూరలు తినడం ఎందుకు ప్రమాదం? దీనికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.

ఇది కూడా చూడండి: Brain Stoke: భారీగా పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్!

ఎందుకు తినకూడదంటే?

వర్షాకాలంలో ఎక్కువగా వానలు పడటం వల్ల నీరు, తేమ నేలపై ఉంటాయి. ఆకు కూరలు నేల మీద నుంచే పుట్టుకుని వస్తాయి. వర్షాల తేమ వల్ల క్రిములు, బ్యాక్టీరియా, ఈగలు, పురుగులు, ఇతర కీటకాలు ఆకుకూరల మీదకు చేరతాయి. ఈ సీజన్‌లో తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్లు, డెంగీ, మలేరియా వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

పరాన్న జీవులు
వర్షం నీరు ఆకుకూరలపై పడటం వల్ల బ్యాక్టీరియా, శిలీంద్రాలు, పరాన్న జీవులు అతివేగంగా వీటిపై వ్యాప్తిస్తాయి. ఇవి ఆకుకూరలపై గుడ్లు పెట్టడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, అతిసారం, టైఫాయిడ్, వాంతులు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకు కూరలపై చిన్న పురుగులు, గుడ్లను తొలగించడం చాలా కష్టం. ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే వర్షాకాలంలో ఆకు కూరలకు ఎలాంటి పురుగులు ఉండకూడదని పెస్టిసైడ్స్ వాడుతారు. రసాయనాలు ఉన్న వీటిని తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ సీజన్‌లో ఆకు కూరలను తీసుకోవాలని అనుకుంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆకు కూరలను సాధారణ నీటిలో కాకుండా గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు, వెనిగర్ కలపాలి. ఇందులో ఆకు కూరలను 10-15 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆకులపై ఉన్న బ్యాక్టీరియా, మట్టి కణాలు అన్ని కూడా ఈజీగా తొలగిపోతాయి. ఇలా కడిగిన తర్వాత బాగా ఉడికించిన తర్వాతే ఆకు కూరలు తీసుకోవాలి. పచ్చిగా సలాడ్‌ల రూపంలో అయితే అసలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ అవి డైరెక్ట్‌గా బాడీలోకి వెళ్లిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మిగతా సీజన్‌లో తింటే?
వర్షా కాలంలో కాకుండా మిగతా సీజన్‌లో ఆకు కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా కంటి సమస్యలు ఉన్నావారు ఆకు కూరలను తీసుకుంటారు. ఇందులో విటమిన్ ఈ, ఏ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి కంటి సమస్యలను తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పాలకూర, మెంతి, మునగ వంటి కూరల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు వంటివి తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చూడండి: Sleep: తక్కువ నిద్రపోయే అలవాటు ఉందా..? ఈ వ్యాధులు శరీరంలోకి వచ్చినట్లే.!!

Advertisment
తాజా కథనాలు