/rtv/media/media_files/2025/11/04/karthika-pournami-2025-2025-11-04-16-40-18.jpg)
Karthika Pournami 2025
కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. ఈ పౌర్ణమి నాడు ఏ చిన్న పని చేసినా కూడా పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఎక్కువగా ఈ పౌర్ణమి నాడు నది, సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఏడాది మొత్తం చేసే పూజ కంటే కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజ చాలా పవిత్రమైనది. ఎక్కువ మంది కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి స్నానం చేస్తుంటారు. కేవలం భక్తి పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి స్నానం ఎందుకు చేస్తారో ఈ స్టోరీలో చూద్దాం.
త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తుందని..
హిందూ ధర్మం ప్రకారం ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి (శ్రీ మహావిష్ణువు), కాండంలో శివుడు (పరమేశ్వరుడు), పైభాగంలో బ్రహ్మదేవుడు కొలువై ఉంటారని నమ్ముతారు. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతికరమైన మాసం. అందుకే ఉసిరి స్నానం చేయడం ద్వారా త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల) ఆశీర్వాదం ఒకేసారి లభిస్తుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలు లేదా ఉసిరి ఆకులు వేసి కాచిన నీటితో స్నానం చేస్తే మనం తెలిసి చేసినా, తెలియక చేసినా జన్మ జన్మల పాపాలు తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ పవిత్రమైన రోజున నదులు, కాలువల్లో స్నానం చేయడం చాలా మంచిది. ఒకవేళ నది స్నానం చేయడానికి వీలు కాకపోతే, ఉసిరి నీటితో స్నానం చేస్తే పవిత్ర గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి స్నానం చేసి ఉసిరి చెట్టును పూజిస్తే డబ్బు ఇబ్బందులు తొలగిపోయి.. ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయని నమ్మకం.
Also Read : లవంగం నీటితో ఎన్ని లాభలో తెలిస్తే తాగకుండా ఉండలేరు మరి.. ఎలా తాగాలో.. ఎప్పుడు తాగాలో చదివి తెలుసుకోండి
కార్తీక మాసం శీతాకాలం మొదలయ్యే సమయం. ఈ సమయంలో ఆరోగ్యానికి ఉసిరి చాలా మేలు చేస్తుంది. ఉసిరిలో విటమిన్ 'సి' ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఉసిరి స్నానం చేయడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, చర్మం ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. ఉసిరి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడి, రోగాల నుంచి రక్షణ లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
Also Read : రాగి.. ఇత్తడి పాత్రలు తళతళ మెరవాలా..? అయితే ఈ కిటుకు తెలుసుకోండి!!
 Follow Us