Karthika Masam: నేడు కార్తీక చివరి సోమవారం.. ఈ నియమాలు పాటిస్తే ఎన్నో జన్మల పుణ్యం మీ సొంతం!

కార్తీక మాసంలో సోమవారం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యాన్ని, శుభాలను ఇస్తాయి. ముఖ్యంగా నేడు కార్తీక చివరి సోమవారం. ఈ రోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం ద్వారా ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది.

New Update
kARTHIKAMASAM

కార్తీక మాసంలో సోమవారం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యాన్ని, శుభాలను ఇస్తాయి. ముఖ్యంగా నేడు కార్తీక చివరి సోమవారం. ఈ రోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని, ఎన్నో జన్మల పుణ్యం సొంతమవుతుందని పండితులు చెబుతున్నారు. అయితే శివుడి అనుగ్రహం కోసం నేడు పాటించాల్సిన ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Today Horoscope: ఈ రాశుల వారికి పొంచి ఉన్న ప్రమాదం.. లైట్ తీసుకుంటే డేంజర్ తప్పదు

ఉదయాన్నే నిద్రలేచి..

ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి. వీలైతే పవిత్ర నదులలో స్నానం చేయడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు. స్నానం తర్వాత ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేసి దీపారాధన చేయాలి. ఈ రోజు 365 వత్తుల దీపం వెలిగించడం మంచిదని పండితులు అంటున్నారు. అయితే తప్పకుండా సాయంత్రం పూట ఇంట్లో దీపం వెలిగించాలని తెలిపారు. ఈ రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం, లేదా ఇంట్లో శివలింగానికి పాలు, నీరు, తేనె వంటి వాటితో అభిషేకం చేయడం వలన శివకటాక్షం లభిస్తుంది. 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వలన మనశ్శాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఒక పూట భోజనం చేయడం లేదా ఉపవాసం ఉండటం మంచిదని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Health Tips: ప్రోటీన్ కోసం మాంసం తినాల్సిన పనిలేదు.. ఈ ఐదు ఆహార పదార్థాలు తింటే చాలు!!

సమీపంలోని శివాలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. గుడిలో శివలింగం ముందు దీపం వెలిగించాలి. ఆలయంలో దీపమాలికలు సమర్పించడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాకుండా కార్తీక మాసంలో దానం చేయడం ఉత్తమం. ఈ చివరి సోమవారం నాడు పేదవారికి లేదా అర్చకులకు నువ్వులు, అన్నదానం లేదా దుప్పట్లు దానం చేయడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ పవిత్రమైన కార్తీక చివరి సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో పైన చెప్పిన నియమాలను పాటిస్తూ శివుడిని పూజించిన వారికి ఐశ్వర్యం, సుఖసంతోషాలు లభిస్తాయి. గత జన్మలలో చేసిన పాపాలు నశించి, అనుకోని అడ్డంకులు తొలగిపోతాయి. వారికి మోక్షం  లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం ఆచరించడం ద్వారా భక్తులకు శివకేశవుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని పండితులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు