/rtv/media/media_files/2025/10/08/today-horoscope-2025-10-08-06-34-32.jpg)
Today Horoscope
మేషం
మీరు చేపట్టిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఆలోచనల్లో తెలివి, స్పష్టత పెరుగుతుంది. మీకు ప్రశాంతత లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని అందరూ మెచ్చుకుంటారు.
వృషభం
పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. కష్టపడాల్సి వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి చేయాలి.
మిథునం
మీ టాలెంట్‌తో అందరినీ ఆకర్షిస్తారు. విందులు, సరదాల్లో పాల్గొంటారు. మీరు వేసుకున్న భవిష్యత్ ప్లాన్‌లు విజయం సాధించడానికి ఉపయోగపడతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి గెలుపొందుతారు.
కర్కాటకం
అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చులు చేయకండి. కుటుంబ సమస్యలను దూరదృష్టితో పరిష్కరించాలి.
సింహం
పనుల్లో అడ్డంకులు వచ్చినా, వాటిని పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు మీకు సహాయం చేస్తాయి. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి మార్గం ఏర్పడుతుంది.
కన్య
మీరు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొని ఆనందిస్తారు.
తుల
స్నేహితులు, సహోద్యోగుల నుండి మీకు సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభం కలిగించే సమాచారం తెలుస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని దాటుకొని విజయాన్ని సాధిస్తారు.
వృశ్చికం
పనులు సక్రమంగా జరగాలంటే జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు
పనుల్లో ఎదురైన అడ్డంకులను దాటుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభవార్తలు పంచుకుంటారు. సూర్య దర్శనం శుభకరం.
మకరం
శుభవార్తలు వినడం వల్ల మీ ఆశలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మీకు కావాల్సిన సహాయం చేస్తారు. వ్యక్తిగత సంబంధాలలో సంతోషకరమైన మార్పులు వస్తాయి.
కుంభం
డబ్బు వ్యవహారాల్లో మీకు కలగలిపిన ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
మీనం
ఆర్థిక లావాదేవీలు బాగా సాగుతాయి. శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
Follow Us