హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు.
ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే..
సకల పాపాలు తొలగిపోతాయి..
ముఖ్యంగా ఈ నెలలో దీపారాధన చేసి శివుడిని నియమనిష్టతో పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కోరిక కోరికలు నెరవేరి అంతా మంచి జరగాలంటే కార్తీక మాసంలో కొన్ని పనులు చేయాలి. ఈ నెలలో ఎక్కువగా నదిస్నానం చేయాలి. ముఖ్యంగా గోదావరి, కృష్ణ, నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్
కార్తీక మాసంలో అన్నదానం, వస్త్ర దానం వంటివి తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఈ మాసంలో శివుడిని, మహా విష్ణువుని భక్తితో పూజించాలి. ఉదయం, సాయంత్రం వేళలో శివాలయానికి వెళ్లి అభిషేకం చేయాలి. అలాగే ఈ నెలలో చేసే దీపారాధన కోటి జన్మల పుణ్యఫలం ఇస్తుందని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య
కార్తీక నెలలో మొత్తం నాలుగు సోమవారాలు వస్తాయి. ఈ నాలుగు రోజులు కూడా తప్పకుండా శివుడిని దర్శించుకుని, ఉపవాసం ఆచరించాలి. ఉపవాసం చేయలేని వారు కనీసం ఒక పూట భోజనం అయిన పాటిస్తే ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది.
ఇది కూడా చూడండి: Train Accident: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పండితులను సంప్రదించి సూచనలు తీసుకోవడం ఉత్తమం.