Cancer Health Tips: ఈ చిన్న పరీక్షతో పదేళ్ల ముందే క్యాన్సర్ ను పసిగట్టొచ్చు.. అదేంటో తెలుసా?

HPV-DeepSeek పరీక్ష ద్వారా క్యాన్సర్‌‌ లక్షణాలు కనిపించడానికి 10 సంవత్సరాల ముందే గుర్తించవచ్చని హార్వర్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు. హ్యూమన్ పాపిల్లోమావైరస్ వల్ల తల, మెడ ప్లేస్‌లో ఈ సంకేతాలను ఈ ద్రవ బయాప్సీ ద్వారా 70 శాతం క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంది.

New Update
HPV-DeepSeek

HPV-DeepSeek

సరైన సమయానికి గుర్తిస్తే ఏ వ్యాధినైనా నయం చేయవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులను కొన్నేళ్ల ముందే గుర్తించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే క్యాన్సర్‌ను కొన్నేళ్ల ముందుగానే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త రకం పరీక్షను అభివృద్ధి చేశారు. ఇంతకీ ఆ పరీక్ష ఏంటి? దీని ద్వారా ఎలా గుర్తిస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 

క్యాన్సర్ సంకేతాలను చెక్ చేసే..

క్యాన్సర్‌‌ లక్షణాలు కనిపించడానికి 10 సంవత్సరాల ముందే తల, మెడ క్యాన్సర్‌ను గుర్తించడానికి కొత్త రక్త పరీక్షను హార్వర్డ్ అనుబంధ మాస్ జనరల్ బ్రిఘం, ఉమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే ఈ పరీక్షను HPV-DeepSeek అంటారు. ఇది హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల తల, మెడ ప్లేస్‌లో క్యాన్సర్ సంకేతాలను చెక్ చేసే ద్రవ బయాప్సీ. యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 70% తల, మెడ క్యాన్సర్ కేసులకు HPVతో లింక్ ఉంది. ఈ HPV-DeepSeek పరీక్షతో రక్తంలో క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు. దాదాపుగా పదేళ్ల ముందే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. దీంతో వ్యాధిని తగ్గించుకోవడానికి చికిత్స తీసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: Home Remedies: చిన్నారుల్లో జలుబు, దగ్గుకు చెక్ పెట్టే అద్భుతమైన ఇంటి చిట్కాలు !!

మరికొందరిలో లక్షణాలు లేకపోయినా కూడా HPV-సంబంధిత క్యాన్సర్‌లను గుర్తించవచ్చు. అయితే దీని చికిత్స కోసం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. రష్యన్ శాస్త్రవేత్తలు ఇటీవల ఎంటెరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్ ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో విజయం సాధించారు. ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ క్యాన్సర్‌తో పోరాడటానికి తయారు చేశారు. ఇది కోవిడ్ 19 లాగానే mRNA టెక్నాలజీని ఉపయోగించింది. ఈ వ్యాక్సిన్ శరీర రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది క్యాన్సర్‌ను నివారించడానికి కాకుండా చికిత్స చేస్తారు. ఈ HPV-DeepSeek పరీక్షతో కొన్నేళ్ల ముందే క్యాన్సర్‌ను గుర్తించి.. సమస్యను క్లియర్ చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Health Tips: ఇలా చేస్తే 15 రోజుల్లో షుగర్ కంట్రోల్‌లోకి రావడం ఖాయం.. తప్పక తెలుసుకోండి!

Advertisment
తాజా కథనాలు