/rtv/media/media_files/2025/10/31/hot-water-bath-2025-10-31-20-32-52.jpg)
hot water Bath
శీతాకాలం వచ్చేసింది. చల్ల చల్లని నీటితో స్నానం చేయాలంటే గజగజ వణికిపోవాల్సిందే. అందువల్ల చాలా మంది శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల ఎంతో మంచిది. అదే సమయంలో వాటిని వేడి చేయడం కూడా పెద్ద సవాలుతో కూడుకున్నది. కొందరు గీజర్ లేదా వాటర్ హీటర్‌ను ఉపయోగించి నీళ్లను వేడి చేస్తుంటారు.
hot water Bath
దీని వల్ల కరెంట్ బిల్లు మోత మోగిస్తుంది. ఇంకొందరు గ్యాస్ ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఎంతో కాలం రావాల్సిన గ్యాస్.. తొందరగా అయిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఇటు కరెంట్ ఉపయోగించకుండా, అటు గ్యాస్ వాడకుండా నీటిని సులభంగా వేడి చేసుకోవచ్చు. అవునండీ మీరు విన్నది నిజమే. చలి కాలంలో కరెంట్, గ్యాస్‌ను ఉపయోగించకుండా నీటిని ఎలా వేడి చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. .
ప్రస్తుతం మార్కెట్‌లో ‘సోలార్ వాటర్ హీటర్లు’ (సోలార్ గీజర్లు) అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా కరెంట్, గ్యాస్ లేకుండా వాటర్‌ను వేడి చేసుకోవచ్చు. ఈ గీజర్లు సూర్యకాంతిపై పనిచేస్తాయి. దీనికి కరెంట్ అండ్ గ్యాస్ అవసరమే లేదు. ఈ సోలార్ గీజర్‌ను వివిధ సామార్థ్యాలలో కొనుక్కోవచ్చు. కరెంట్ లేకుండా నీళ్లను వేడి చేయాలనుకుంటే ఈ పద్దతిని యూజ్ చేయవచ్చు. .
అలాగే ఇది సోలార్ కాకుండా మరొక పద్ధతి కూడా ఉంది. సూర్య కాంతి ఎక్కువగా నల్లటి రంగును ఆకర్షిస్తుంది. అందువల్ల మీరు ఒక డ్రమ్‌కు బ్లాక్ పెయింట్ వేసి.. అందులో నీటిని నింపాలి. ఆ తర్వాత దాన్ని ఎండతగిలే ప్రదేశంలో పెట్టాలి. అప్పుడు నీళ్లు చాలా త్వరగా వేడెక్కుతాయి.
ఇది మాత్రమే కాకుండా మరొక పద్ధతి ఉంది. అదే కట్టెల పొయ్యి. కరెంట్, గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యిపై నీళ్లను వేడి చేసుకోవచ్చు. ఇది వేగంగా పనిచేస్తుంది. అందువల్ల చలికాలంలో మీరు రూపాయి ఖర్చులేకుండా వెచ్చటి నీళ్లతో స్నానం చేయాలనుకుంటే ఇవే బెస్ట్ ఆప్షన్స్.
Follow Us