Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!

కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..

New Update
horoscope 2025 today

horoscope 2025 today

మేషరాశి వారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. శుభకార్యాలలో బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు.

Also Read: Actress Ranya Rao:గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం, సాహసంతో పనిచేసి వృత్తి వ్యాపారాల్లో నూతన శిఖరాలు అధిరోహిస్తారు. అన్ని రంగాల వారికి సర్వత్రా విజయమే! పితృ సంబంధమైన ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి.

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలను సమర్థతతో అధిగమిస్తారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవడం సంకటంగా మారుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

Also Read: Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్‌!

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. సమాచార లోపంతో బంధువుల మధ్య కలహాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాముల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది.

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో ప్రోత్సహకారమైన వాతావరణం ఉంటుంది. కీలకమైన అంశాలలో మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రోజంతా ఆరోగ్యకరంగా, శక్తిమంతంగా, ఉత్సాహంగా ఉంటారు. 

కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు. సమాజంలో పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబ విలువేంటో గ్రహిస్తారు. చాకచక్యంతో అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు. 

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. వృత్తి పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఓ సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. కుటుంబంలో కలహ సూచన ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండండి. పెద్దల సహకారంతో వృత్తి పరంగా ఎదుగుతారు. 

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పనిలో మీరు చూపే సంకల్పం, నిబద్ధత కారణంగా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో రాబడి పెరగడం సంతోషం కలిగిస్తుంది. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.


మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే పనులలో విజయం సిద్ధిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవరాలలో ధనలాభాలు మెండుగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది.

కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. 

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సృజనాత్మకంగా వ్యవహరించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గిట్టని వారు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి.

Also Read:Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌.. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు

Also Read: పాక్‌లో ట్రైన్‌ హైజాక్.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) డిమాండ్స్‌ ఏంటి?.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు