Horoscope Today: నేడు ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టినా విజయమే..

కన్య రాశివారు ఈరోజు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. సింహం రాశివారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మిగిలిన రాశుల వారికి ఈరోజు ఎలా ఉంటుందో ఈ కథనంలో..

New Update
New Year 2024 : కొత్త ఏడాదిలో ఈ రాశివారికి సక్సెస్ ఫిక్స్..!!

మేష రాశి  వారు గతంలో వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. మానసిక ఆనందం పొందుతారు.

Also Read: TG: తెలంగాణలో చలి పులి పంజా..రానున్న ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి సుమా

వృషభం రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం బెటర్‌. దూరపు బంధువులను కలిసి ఆనందంగా ఉంటారు. తద్వారా లాభాలు పొందుతారు.

మిథున రాశి వారు ఈరోజు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు పొందుతారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త గా ఉండటం మంచిది.

కర్కాటక రాశి వారు ఈ  రోజు ఏ విషయంలోనూ స్థిరనిర్ణయాలు తీసుకోలేకపోతారు. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read: Maha Kumbamela 2025: నేటి నుంచి మహాకుంభమేళ ఉత్సవాలు.. మొదటి రాజ స్నానం ఎప్పుడు చేయాలి? శుభ సమయం ఏంటి?

సింహ రాశి వారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరిక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా అనిపించవు. వృథా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం వద్దు.

కన్య  రాశి వారు ఈరోజు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. 

ధైర్యసాహసాలు...

తుల రాశి వారు ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. 

వృశ్చిక రాశి వారు ఈరోజు  అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవతాయి. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.

ధనుస్సు రాశి వారు ఈరోజు వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం పెరుగుతుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్తవహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు.

మకర రాశి వారికి  సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఉంటాయి. బంధు, మిత్రులను కలుస్తారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి వారికి ఈరోజు  నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలకు లోపముండదు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు.

మీన రాశి వారికి ఈరోజు గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి.

Also Raed: Delhi: మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్

Also Read: దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ

Advertisment