Holi 2025: హోలీ కలర్స్.. సహజంగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

హోలీ ఆడటానికి రంగులు తప్పకుండా కావాలి. ఈ రంగులను బీట్‌రూట్, పాలకూర, పసుపు, క్యారెట్, గులాబీ, బంతి పువ్వులతో ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తురుముకుని, ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకుంటే కలర్స్ రెడీ.

author-image
By Kusuma
New Update
Natural Colors

Natural Colors Photograph: (Natural Colors)

హోలీ ఆడటానికి రంగులు తప్పకుండా ఉండాలి. వీటిని సహజంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే రంగుల్లో రసాయనాలు ఉంటాయి. వీటికి బదులు మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. 

బీట్‌రూట్

బీట్‌రూట్ ను ఉపయోగించి ఇంట్లోనే ముదురు ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు. ముందుగా బీట్‌రూట్‌ను కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసి తురుముకోవాలి. తరువాత దాని రసాన్ని తీసి కాటన్ గుడ్డలో చుట్టి ఎండలో ఆరబెట్టాలి. అది ఆరిన తర్వాత.. మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అంతే సహజమైన ఎరుపు రంగు సిద్ధమైనట్లే.

ఇది కూడా చూడండి:గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

పాలకూర
ఈ ఆకు కూరతో గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. ముందుగా పాలకూర ఆకులను బాగా కడిగి మరిగించాలి. మరిగిన తర్వాత పాలకూర ఆకులను బాగా ఎండబెట్టి.. అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అంతే పచ్చని రంగు రెడీ.

క్యారెట్
క్యారెట్ తో నారింజ రంగును రెడీ చేసుకోవచ్చు. ఈ రంగుని తయారు చేయడం చాలా సులభం. ముందు క్యారెట్లను శుభ్రం చేసి.. తర్వాత వాటిని బాగా తురుముకోవాలి. రసం తీసి.. మిగిన దానిని ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత క్యారెట్ పీల్ ను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అంతే నేచరాల్ నారింజ రంగు రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి:బిగ్ షాక్‌ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !

పసుపు
పసుపు సహజంగా పసుపు రంగులో ఉంటుంది. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కనుక హోలీ నాడు పసుపు రంగు గా పసుపును ఉపయోగించవచ్చు. పసుపు తీసుకొని బాగా మెత్తని పొడిలా చేసుకోవాలి.

గులాబీ రేకులు
ఇంట్లో గులాబీ రేకులను ఉపయోగించి సహజ రంగులను కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో సహజమైన రంగులను తయారు చేయడం చాలా సులభం. తాజా గులాబీ రేకులను బాగా కడిగి ఆరబెట్టండి. తరువాత రేకులను మెత్తగా గ్రైండ్ చేసి వాటి పొడిగా తయారు చేయండి. హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడానికి ఈ గులాబీ పొడిని ఉపయోగించవచ్చు.

ఇది కూడా చూడండి:Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

బంతి పువ్వులు
బంతి పువ్వులు పసుపు, నారింజ రంగులలో ఉంటాయి. బంతి పువ్వులను రేకులుగా విడగొట్టి.. వాటి రేకులను నీళ్లలో వేసి కడగాలి. తర్వాత ఆ రేకులను ఎండబెట్టి.. తర్వాత మిక్సి లో వేసి మెత్తని పొడిగా చేయాలి.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి:Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!

Advertisment
తాజా కథనాలు