ప్రస్తుతం ఉన్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలకి థైరాయిడ్ సమస్య ఎక్కువగా వస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడం, పోషకాలు లేని ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
ఇది కూడా చూడండి: ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM..
థైరాయిడ్‌తో జుట్టు అధికంగా..
థైరాయిడ్ ఉన్న అమ్మాయిల్లో ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జట్టు అధికంగా రాలుతుంటే థైరాయిడ్ ఉన్నట్లే. వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. థైరాయిడ్ సమస్య వస్తే కొందరు అమ్మాయిలు బరువు అధికంగా పెరుగుతారు. కొందరు అధికంగా బరువు తగ్గుతారు. ఈ లక్షణాలు కూడా బాడీలో కనిపిస్తే వైద్యుని సంప్రదించాలి.
ఇది కూడా చూడండి: Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?
థైరాయిడ్‌కి మెడిసిన్ వాడకపోతే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. దీంతో జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది. దీన్ని నుంచి బయట పడాలంటే జీవనశైలి, ఆహార అలవాట్లను కూడా మార్చాలి. ఈ సమస్య బారిన పడిన వారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీంతో జుట్టు పలచగా మారుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుని సమస్యను తగ్గించుకోవాలి. లేకపోతే హైపో థైరాయిడిజానికి దారితీస్తుంది.
ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?
కాల్షియం, విటమిన్ డి లోపం వల్లే థైరాయిడ్ ఉన్నవారికి జుట్టు ఎక్కువగా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, నువ్వులు, నట్స్, ఖర్జూరం, తృణ ధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే విటమిన్ డి కోసం రోజూ ఉదయం ఎండలో ఉండండి.
ఇది కూడా చూడండి: Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.