రోడ్డు పక్కన హోటల్స్ లో టిఫిన్ తింటున్నారా? స్మశానంలో మీకు బెర్త్ కన్ఫర్మ్

రోడ్డు సైడ్ టిఫిన్స్, ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొంతమంది వాడిన ఆయిల్ నే మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల నూనెలో క్యాన్సర్ కారక రసాయనం అక్రోలిన్‌ను విడుదలవుతుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.

New Update
road side food (1)

road side food causing cancer

Cancer:  నేటి బిజీ లైఫ్ చాలా మంది ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకునే సమయం దొరక్క బయట ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. అలా మార్నింగ్ టిఫిన్స్ నుంచి  నైట్ డిన్నర్ వరకు బయటే తింటారు. రోడ్ సైడ్ టిఫిన్స్, బిర్యానీలు, ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. వీటిని తినేటప్పుడు రుచిగా ఉందా..? ఆకలి తీరిందా అని మాత్రమే అందరూ ఆలోచిస్తారు. కానీ వాటిని ఎలా తయారు చేస్తున్నారు అనేది మాత్రం పెద్దగా పట్టించుకోరు. అయితే  ఇదే మీ ప్రాణాలకు ముప్పని మీకు తెలుసా..? తాజా పరిశోధనలో రోడ్ సైడ్ ఆహారాలకు సంబంధించి షాకింగ్ విషయాలు 

Also Read:  ముదురుతున్న మెగా యుద్ధం.. బన్నీకి వరుణ్‌తేజ్‌ కౌంటర్‌తో మరోసారి రచ్చ రచ్చ!

క్యాన్సర్ ముప్పు 

అయితే రోడ్ సైడ్ టిఫిన్స్, ఇతర ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. వీలైనంత వరకు నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే.. కొంతమంది ఒకసారి వాడిన మళ్ళీ మళ్ళీ వాడడం చేస్తుంటారు. ఇలా నూనెను ఎక్కువసార్లు మరిగించడం వల్ల అందులోని టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌ (TPC) ఫ్రీరాడికల్స్‌గా మారుతాయి.  FSSAI నిబంధనల ప్రకారం వంట నూనెలో పోలార్‌ కాంపౌండ్స్‌ 25 శాతానికి మించితే .. ఆ నూనెను మార్చాలి. నూనె మళ్లీ వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారక రసాయనం అక్రోలిన్‌ను విడుదలవుతుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతోంది. అలాగే బయట తినే ఆహారాల్లో ఫుడ్‌ కలర్స్ , టేస్టింగ్‌ సాల్ట్‌, సోయా సాస్‌లు మోతాదుకు మించి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. 

Also Read: ఏపీ బడ్జెట్.. మెగా డీఎస్సీ, తల్లికి వందనంపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: ఈ వారం బాక్స్ ఆఫీస్ పండగ.. సినిమాల లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే !

Advertisment
Advertisment
తాజా కథనాలు