Hair Health: జుట్టును పెంచే అదిరిపోయే సీరమ్.. వారం రోజులు అప్లై చేస్తే.. దృఢమైన జుట్టు మీ సొంతం

మెంతులు, నల్లజీలకర్ర, అవిసె గింజలు, లవంగాలు, విటమిన్ ఈ క్యాప్సూల్స్‌తో హెయిర్ సీరమ్ తయారు చేసుకోవచ్చు. వీటిని వాటర్‌లో కలిపి మరిగించి అయినా హెయిర్‌కు పెట్టుకోవచ్చు. లేదా వీటిని పొడితో చేసిన హెయిర్ సీరమ్‌ను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

New Update
hair

hair

జుట్టు బలంగా దృఢంగా ఉండాలని అమ్మాయిలు ఎన్నో రకాల టిప్స్ పాటిస్తుంటారు. ముఖ్యంగా సహజమైన చిట్కాలు పాటిస్తారు. అయితే మారిన జీవనశైలి వల్ల మహిళల జుట్టు రాలిపోతుంది. దీనికి తోడు రసాయనాలు అధికంగా ఉండే షాంపూలు, నూనెలు వంటివి వాడుతున్నారు. వీటితో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్, మిషన్స్, కరెంట్‌తో హెయిర్ స్టైలింగ్ వంటివి చేస్తున్నారు. వీటివల్ల ఆరోగ్యంగా పెరగాల్సిన జుట్టు రాలిపోతుంది. అయితే జుట్టు బలంగా, దృఢంగా పెరగాలంటే మాత్రం తప్పకుండా సహజ సిద్ధంగా ఉండే సీరమ్‌ను వాడాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సీరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలి? పూర్తి వివరాలు ఈస్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Today Horoscope: ఈ రాశుల వారికి నేడు యమ డేంజర్.. కాస్త జాగ్రత్త వహించకపోతే ఇక అంతే సంగతులు

వీటిలోని పోషకాలు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా..

సహజంగా ఇంట్లోనే మెంతులు, నల్లజీలకర్ర, అవిసె గింజలు, లవంగాలు, విటమిన్ ఈ క్యాప్సూల్స్‌తో హెయిర్ సీరమ్ తయారు చేసుకోవచ్చు. ముందుగా వీటిని వాటర్‌లో కలిపి మరిగించి అయినా హెయిర్‌కు పెట్టుకోవచ్చు. లేదా వీటిని పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్‌లో కప్పు నీరు వేసి అందులో కలపాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగించడం వల్ల మిశ్రమం చిక్కగా మారుతుంది. వెంటనే దాన్ని వడకట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ఒక రెండు విటమిన్ E క్యాప్సూల్స్ కట్ చేసి వేయాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత జుట్టుకు అప్లై చేయడం వల్ల బాగా పెరుగుతుంది. అయితే ఇలా అప్లై చేసుకున్న తర్వాత తప్పకుండా తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఎంత సన్నగా ఉన్న జుట్టు అయినా కూడా ఈజీగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Health Issues: సీజనల్ ఫ్రూట్ అని ఉదయాన్నే తింటున్నారా.. అయితే మీకు ఈ డేంజర్ సమస్యలు తప్పవు

ఈ హెయిర్ సీరమ్‌ను వాడటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు పెరుగుతుంది. వీటిన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెంతుల్లో ఉన్న ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, నయాసిన్ వంటి పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. దీంతో అవి బలంగా పెరుగుతాయి. అలాగే చుండ్రు తగ్గుతుంది. లవంగాల్లో పోషకాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తలపై ఉన్న స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా అలెర్జీ వంటి సమస్యలు అయితే  రావు. అలాగే అవిసె గింజల్లోని పోషకాలు జుట్టుకు సహజ మెరుపును అందిస్తుంది. వీటిలో ఒమేగా 3 వంటి ఆమ్లాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరిగేలా చేస్తాయి. వీటిలో ఉపయోగించిన విటమిన్ ఈ లో పోషకాలు ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు