Today Horoscope: ఈ రాశుల వారికి నేడు యమ డేంజర్.. కాస్త జాగ్రత్త వహించకపోతే ఇక అంతే సంగతులు

నేడు కొన్ని రాశుల వారికి చెడు జరగనుంది. ఏ  పని తలపెట్టినా కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని పండితులు అంటున్నారు. అయితే నేడు ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఈ స్టోరీలో చూద్దాం. 

New Update
Today Horoscope

Today Horoscope

మేషం

మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వంటి అన్ని రంగాలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. బంధువులు, స్నేహితులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. ఒక మంచి సంఘటన సంతోషాన్ని మీకు తెచ్చిపెడుతుంది. 

వృషభం 
మీరు మీ మనోబలంతో అనుకున్న పనులను సాధిస్తారు. అవసరమైన సహాయం అందుతుంది. బంధువులు, స్నేహితులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్న సమస్యలు ఈ వారం తొలగిపోతాయి. 

మిథునం
మీరు ఇది మంచి శుభకాలం. ఏ పని తలపెట్టినా కూడా విజయాన్ని ఇవ్వడంతో పాటు గౌరవాన్ని కూడా తెచ్చిపెడతాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అలాగే బంధువులతో ఎంతో సంతోషంగా ఉంటారు. 

కర్కాటకం
ఈ రాశి వారు మొదలు పెట్టిన పనులు అన్ని కూడా చక్కటి ప్రణాళికతో పూర్తి చేస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంతానం లేని వారు శుభవార్తలు వింటారు. 

సింహం 
శుభవార్తలు వింటారు. అయితే  మీపై ఎలాంటి ఒత్తిడి పెరగకుండా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మాట తప్పకుండా వినాలి. 

కన్య 
మీరు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా, వాటిని దాటుకొని ముందుకు వెళ్తారు. కష్టాలు తొలగిపోతాయి. మీ బంధాలను పటిష్టం చేసుకోవడం మంచిది. కాబట్టి ఆలోచించి మాట్లాడటం మంచిది. 

తుల 
మీకు అదృష్ట ఫలితాలు ఉన్నాయి. అన్ని  రంగాల వారికి మంచి జరుగుతుంది. కొన్ని విషయాలలో మీరు ధైర్యంగా వ్యవహరించి అందరి మెప్పు పొందుతారు.

వృశ్చికం 
మీకు శుభఫలితాలు ఉన్నాయి. మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మానసికంగా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు
పెద్దల సహకారం మీకు లభిస్తుంది. మీరు మొదలుపెట్టిన పనులలో కొన్ని ఆటంకాలు వచ్చినా, వాటిని దాటడానికి ప్రయత్నం చేస్తారు. ముందు జాగ్రత్త లేకపోవడం వలన అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మీకు బాధ కలిగిస్తాయి.

మకరం 
మీరు పట్టుదలతో మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంలో మాత్రం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు.

కుంభం 
మీకు అవసరమైన సహాయం అందుతుంది. బంధువులు, స్నేహితుల సలహాలు పాటించకపోవడం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు. 

మీనం 
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కాకపోతే తెలివితో వ్యవహరించాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు