/rtv/media/media_files/2025/10/08/digestive-issues-2025-10-08-08-04-45.jpg)
Digestive issues
సీజనల్‌గా లభించే సీతాఫలం ఫ్రూట్ అంటే చాలా మందికి ఇష్టం. కొన్ని నెలలు మాత్రమే లభించడంతో ఎంతో ఇష్టంతో కొందరు తింటారు. ఎలా అంటే చివరకు టిఫిన్‌గా కూడా సీతాఫలం తీసుకుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటారు. ఒకటి లేదా రెండు తింటే పర్లేదు. కానీ అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా లిమిట్‌లో తింటే ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో ప్రొటీన్, మెగ్నీషియం, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే పోషకాలు అధికంగా ఉండే సీతాఫలం ఉదయాన్నే తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
జీర్ణ సమస్యలు
ఉదయం పూట పరగడుపున సీతాఫలం తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏదైనా తిన్న తర్వాత సీతాఫలం తింటే పర్లేదు. అలాగని ఎక్కువగా తినకూడదు. అతిగా తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు అన్ని కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బరువు పెరగడం
సీతాఫలంలో కేలరీలు అధికంగా ఉంటాయి. వీటివల్ల వీటిని ఉదయం పూట తినడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే ఈ పండ్లు సాధారణంగానే స్వీట్‌గా ఉంటాయి. దీనివల్ల మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు అసలు వీటిని తీసుకోకూడదు. దీనివల్ల బాగా బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు.
నరాల సంబంధిత సమస్యలు
సీతాఫలంలో అనోనాసిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఎక్కువగా దీన్ని తీసుకోవడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తీసుకుంటే లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
మధుమేహం
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మికంగా పెరుగుతాయి. ఇందులోని ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేసినా కూడా అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుందుని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.