/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/mehandi-7-scaled.jpg)
Gorintaku
చలికాలంలో చర్మంతో పాటు జుట్టు (Hair) కూడా ఎక్కువగా దెబ్బతింటుంది. ముఖ్యంగా జుట్టు (Hair) పొడిగా మారడంతో పాటు రంగు కూడా మారుతుంది. దీంతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీనివల్ల చాలా మంది రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోవడంతో పాటు పెరుగుదల కూడా ఆగిపోతుంది. జుట్టు కుదుళ్ల నుంచి బలహీనం అయిపోతుంది. రసాయనాలు (Chemicals) ఉండే ప్రొడక్ట్స్ (Products) వల్ల ఉన్న జుట్టుని కూడా కొందరు నాశనం చేసుకుంటారు. అయితే ఎలాంటి ప్రొడక్ట్స్ వాడకుండా ఈజీగా జుట్టు రంగు మార్చుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఎలాగో మరి ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Rinku Singh: పెళ్లికి సిద్ధమైన క్రికెటర్.. యంగ్ ఎంపీతో త్వరలో వివాహం
గోరింటాకుతో జుట్టును నల్లగా..
జుట్టు రంగు మారకుండా ఉండాలంటే రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ కాకుండా గోరింటాకు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. గోరింటాకులో కాఫీ పొడి, పెరుగు, నిమ్మరసం వేసి మిశ్రమం తయారు చేయాలి. దీన్ని కుదుళ్లకు పట్టించి.. ఒక అరగంట పాటు వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు నల్లగా ఉంటుంది. ఇలా మూడు నెలలకు ఒకసారి చేస్తే జుట్టు రంగు మారకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?