/rtv/media/media_files/2025/07/24/gajalakshmi-raja-yogam-2025-2025-07-24-16-21-31.jpg)
Gajalakshmi Raja Yogam 2025
Gajalakshmi Raja Yoga: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గజలక్ష్మి యోగం అనేది అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన యోగాలలో ఒకటని చెబుతారు. గజ అంటే 'ఏనుగు' లక్ష్మీ అంటే సంపద. ఏనుగును సంపద, బలం, ఐశ్వర్యానికి ప్రతీకలు! కావున ఈ యోగం లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహాన్ని సూచిస్తుందని చెబుతారు. ఈ యోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశులు, జాతకాల వారు అఖండమైన కీర్తి సంపదలు, సుఖసంతోషాలు, గౌరవం పొందుతారని విశ్వాసం. శుక్రుడు, బృహస్పతి గ్రహాల కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది. అయితే దాదాపు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఏడాది జులై 26న గజలక్ష్మి యోగం ఏర్పడనుంది.
గజలక్ష్మి యోగం
24 సంవత్సరాల తర్వాత మళ్ళీ 'గజలక్ష్మి' యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. వారి ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం
మేష రాశి
గజలక్ష్మి యోగం మేషరాశి వారికి వృత్తిపరంగా, కెరీర్ పరంగా పురోగతిని సూచిస్తుంది. వారి స్నేహబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే వ్యాపార పరంగా నిలిచిపోయిన పనులు త్వరలో పూర్తయ్యే అవకాశాలున్నాయి.
కన్యా రాశి
శుక్రుడు, బృహస్పతి గ్రహాల కలయిక కన్యా రాశిలో మంచి ప్రభావం చూపబోతుంది. ముఖ్యంగా ఈ రాశివారు కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు, ఏదైనా ఫ్లాట్ కొనుగోలు చేసే వారికి శుభ సూచకంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలున్నాయి.
మిథున రాశి
మిథున రాశి వారు ఆర్థికంగా మరింత బలపడనున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. కొత్త పెట్టుబలతో భారీ లాభాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి.
సింహ రాశి
గజలక్ష్మి యోగం సిమ్హరాశివారికి శుభసూచకంగా కనిపిస్తుంది. కెరీర్ పరంగా, ఆర్థికంగా మెరుగైన పరిస్థితులను చూస్తారు. కుటుంబంలో ఆనందం, ఊహించని సంపాదనలు ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి.
తులా రాశి
గజలక్ష్మి యోగం.. తులారాశి వారి జీవితంలో ఆర్ధిక సంతోషాలను కలిగించబోతుంది. వీరి సంపాదన, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే చాలాకాలం నుంచి కొనసాగుతున్న మనస్పర్థలు తొలగిపోతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం తగ్గుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.