/rtv/media/media_files/2025/06/14/IMTc3BzdGjM34CsyW4aL.jpg)
fathers day special gifts
Father's Day 2025: ప్రతి ఏడాది జూన్ 15న ఫాదర్స్ డే జరుపుకుంటారు. జీవితమంతా మనకు తోడుగా, అండగా ఉంటూ, మనపట్ల నిస్వార్థమైన ప్రేమను చూపించే నాన్నకు ఈ రోజును ప్రత్యేకంగా డేడికేట్ చేస్తూ ఫాదర్స్ డేను జరుపుకుంటాము. అయితే ఈ రోజున నాన్నకు ఏం బహుమతి ఇవ్వాలా? అని చాలా మంది ఆలోచిస్తారు. బహుమతిగా ఇవ్వనడానికి కొత్త షర్ట్, వాచ్, పర్ఫ్యూమ్... ఇలా చాలానే ఉంటాయి. కానీ నిజంగా నాన్నకు గుర్తుండిపోయేది, ఆయన మనసును సంతోషపరిచే మాత్రం కొన్నే ఉన్నాయి! వాటిని మనం డబ్బుతో ఎప్పుడూ వెలకట్టలేము! అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
డబ్బుతో కొనలేని బహుమతులు
మీ అమూల్యమైన సమయం
ఈ రోజుల్లో అందరూ చాలా బిజీగా ఉంటారు. ఫోన్లలో, పనుల్లో పడి నాన్నతో మాట్లాడటానికే సమయం దొరకదు. ఫాదర్స్ డే రోజు నాన్నతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పండి. ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు, కష్టాలు, సంతోషాలు అడగండి. ఆయన పక్కన కూర్చుని సినిమాలు చూడండి, పాటలు వినండి. ఈ సమయం ఆయనకు ఎంతో విలువైన బహుమతి.
Also Read: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!
మీ అంతులేని ప్రేమ, కృతజ్ఞత
నాన్నలు సాధారణంగా తమ ప్రేమను మాటల్లో అంతగా వ్యక్తపరచరు, కానీ వారి ప్రతి చర్యలో అది కనిపిస్తుంది. మనకు కూడా వారి పట్ల ఎంత ప్రేమ, కృతజ్ఞతగా ఉన్నామో చేతల్లో చూపించాలి. ఒక చిన్న "థ్యాంక్యూ.. అలాగే నాన్న, మీరు లేకపోతే నేను లేను" అనే చిన్న మాట ఆయన కళ్ళలో ఆనందాన్ని నింపుతుంది. ఒక ఆప్యాయమైన ఆలింగనం ఆయన అలసటను దూరం చేస్తుంది.
Also Read: ఇచ్చిన అప్పు అడిగితే జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమాన
/rtv/media/media_files/2025/06/14/Fuz1uDMnJ8K1amLaOLTu.jpg)
మీ చిరునవ్వు, విజయం
నాన్నలు తమ పిల్లల విజయంలోనే తమ విజయాన్ని చూసుకుంటారు. మనం సంతోషంగా ఉండి, జీవితంలో ఏదైనా సాధిస్తే, అది ఆయనకు ఎంతో గర్వాన్ని ఇస్తుంది. మనం చేసే ప్రతి మంచి పని, సాధించే ప్రతి విజయం ఆయనకు ఇచ్చే అత్యుత్తమ బహుమతి.
Also Read: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య
ఆయన ఆరోగ్యానికి ప్రాధాన్యత
నాన్నలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఫాదర్స్ డే నాడు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని చెప్పండి, లేదా ఆయనకు ఇష్టమైన వ్యాయామం, యోగా వంటి వాటిని ప్రోత్సహించండి. ఆయన ఆరోగ్యంగా ఉంటే, మనకు అంతకంటే గొప్ప బహుమతి ఇంకేముంటుంది?
ఆయన ఆశయాలకు మద్దతు
నాన్నకు ఏదైనా కల, ఆశయం ఉంటే, దానికి మీ సపోర్ట్ చేయండి. అది ఒక చిన్న హాబీ కావచ్చు, లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే కోరిక కావచ్చు. ఆయన కలను నెరవేర్చుకోవడానికి మీరు పక్కన ఉన్నారని చూపించండి.
డబ్బుతో కొనే బహుమతులు తాత్కాలికమే. కానీ ప్రేమతో, మనసుతో ఇచ్చే ఈ బహుమతులు నాన్నకు జీవితాంతం గుర్తుండిపోతాయి.