Danger: డేంజర్.. గోళ్ల విషయంలో ఈ ఛేంజస్ ఉంటే లంగ్ క్యాన్సర్.. షాకింగ్ విషయాలు వెల్లడి!

గోళ్ల చివర మార్పులు, తిమ్మిరి, జలదరింపు, ఎర్రగా మారడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ముందుగానే గుర్తిస్తే ఈ ప్రమాదకర క్యాన్సర్ నుంచి బయట పడవచ్చని నిపుణులు అంటున్నారు.

New Update
Lung Cancer

Lung Cancer

మారిన జీవనశైలి వల్ల ప్రస్తుతం ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. పోషకాల ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల ముఖ్యంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌లో ప్రాణాంతకమైన లంగ్ క్యాన్సర్ ప్రస్తుతం కొందరిని ఇబ్బంది పెడుతుంది. అయితే తెలిసో తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే గోళ్లలో వచ్చే కొన్ని మార్పుల వల్ల లంగ్ క్యాన్సర్ బారిన ఎక్కువ మంది పడుతున్నారని నిపుణులు అంటున్నారు. అయితే గోళ్ల విషయంలో ఎలాంటి మార్పులు వస్తే ముందుగానే లంగ్ క్యాన్సర్‌ను గుర్తించవచ్చో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Health Tips: మోషన్ ఇర్రెగ్యులర్‌గా ఉందా..? నిపుణుల సలహాలు.. పరిష్కార మార్గాలు తెలుసుకోండి!!

ముందుగానే గుర్తిస్తే..

లంగ్ క్యాన్సర్ వచ్చిన వెంంటనే గోళ్ల ఆకారం నిర్మాణంలో మార్పులు వస్తాయి. అయితే  కొందరికి ఈ వ్యాధి మొదట్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ముందుగానే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్సతో నయం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు.  అయితే లంగ్ క్యాన్సర్ ఉంటే.. ఫింగర్ క్లబ్బింగ్ ఏర్పడుతుంది. అంటే వేళ్ల చివర్లు పూర్తిగా వాచిపోయి, గోళ్ల ఆకారంలో మార్పులు వస్తాయి. అలాగే వేళ్లు చివరగా ఉబ్బుతాయి. గోళ్లు కింద వైపుకు వంగిపోవడం, చెంచా ఆకారంలో మారడం వంటివి జరుగుతాయి.

అలాగే గోరు క్యూటికల్ మధ్య ఉండే కోణం సాధారణంగా కంటే పెరుగుతుంది. ఎక్కువ శాతం మందిలో ఈ ముఖ్య లక్షణమే కనిపిస్తుంది. ఈ లక్షణాలను మొదటిలోనే గుర్తిస్తే ప్రాణాలకు ప్రమాదం ఉండదని నిపుణులు అంటున్నారు. గోళ్లు ఎరుపు  రంగులో కనిపించడం, తిమ్మిరి, జలదరింపు ఇలా మార్పులు వస్తుంటే కేవలం ఊపిరితిత్తలు క్యాన్సర్ మాత్రమే కాదని, కాలేయ క్యాన్సర్, వైరల్ ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్ వంటి వ్యాధులు కూడా ఉన్నట్లేనని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు