Health Tips: నిద్రపోయే ముందు ఈ వెల్లుల్లిని తీసుకుంటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్

కాల్చిన వెల్లిల్లుని తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం పూట తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.

New Update
roasted garlic

roasted garlic

మన వంటగదిలో రోజూ కనిపించే వెల్లుల్లి కేవలం రుచి కోసమే కాదు.. అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే వెల్లుల్లిని సాధారణంగా కాకుండా కాల్చి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే కాల్చిన వెల్లుల్లిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం. 

రోగనిరోధక శక్తి

కాల్చిన వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాగే అంటు వ్యాధులను తగ్గిస్తాయి. ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతీ రోజూ కూడా ఒక చిన్న కాల్చిన వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు.

జీర్ణక్రియకు సహజ నివారణ
కాల్చిన వెల్లుల్లి జీర్ణ వ్యవస్థకు అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని ఉడికించినప్పుడు లేదా కాల్చినప్పుడు, దానిలోని కఠినమైన రసాయనాలు మృదువుగా మారతాయి. దీనివల్ల కడుపు దాన్ని జీర్ణం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల పేగు శుభ్రంగా ఉంటుంది. 

గుండె ఆరోగ్యం
వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని అల్లిసిన్ రక్తపోటును తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గుండెపోటు తగ్గి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 

ఎముకల ఆరోగ్యం 
కాల్చిన వెల్లుల్లిలో కాల్షియం, మాంగనీస్, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో  ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఇవి ఎముకల బలహీనత, వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్‌ను వంటి సమస్యలను తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

జలుబు, దగ్గు
సాధారణంగా సీజన్ మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. దీనిలో శక్తివంతమైన యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. అయితే ఉదయం పూట వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు