Banana : నెల రోజులు ఖాళీ కడుపుతో ఈ పండు తినండి.. ఆ వ్యాధులు పరార్!

అరటిపండు రోజూ ఖాళీ కడుపుతో తింటే శక్తి సమృద్ధి అందుతుంది. రోజూ 1-2 పండ్లు తింటే జీర్ణశక్తి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అధిక బీపీ, కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి పాలతో అరటి కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

author-image
By Vijaya Nimma
New Update
banana

Health Tips : రోజూ అరటిపండు (Banana) తినడం వల్ల పొట్ట, శరీరానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ అరటిపండు తినాలి. దీనివల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పండ్లలో రారాజు కావచ్చు కానీ అరటిపండు తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపండు ఎవరికీ తక్కువ కాదు. రుచిలోనూ, ఆరోగ్యంలోనూ ఇది గొప్ప పండు. శక్తి సమృద్ధిగా, ధరలో పొదుపుగా ఉండే అరటి ఈ ప్రత్యేకత.. ఇతర పండ్ల నుంచి వేరు చేస్తుంది. రోజూ అరటిపండు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అరటిపండులో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే అరటిపండులో గొప్ప లక్షణాలు ఉన్నాయి. అరటిపండు తినడం చర్మానికి మంచిదట. ప్రతీరోజూ అరటిపండు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Also Read :  రాత్రి ఈ దుస్తులు వేసుకోండి.. ఆరోగ్యానికి మంచిది!

అరటిపండులో ఉండే పోషకాలు:

  • అరటిపండులో విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, సోడియం, ఐరన్, అనేక ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అరటిపండులో అధిక కేలరీలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇందులో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, మెగ్నీషియం, కాపర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

Also Read :  దిండు పెట్టుకొని నిద్రపోతున్నారా..?

అరటిపండు తింటే కలిగే ప్రయోజనాలు:

  • అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రోజూ 1-2 అరటిపండ్లు తినడం వల్ల జీర్ణశక్తి మెరిగి కడుపు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకూండా మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి.
  • అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. రోజూ 1-2 అరటిపండ్లు తింటే బీపీ అదుపులో ఉంటుంది.
  • రోజూ అరటిపండు తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటుంది. అరటిపండులో ఉండే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రోజూ 1-2 పండ్ల తింటే కిడ్నీ పనితీరును మెరుగుపడి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
  • అరటిపండులో అనేక పోషకాలు ఉన్నాయి. శరీరం ఆరోగ్యంగా, దృఢంగా, రోగనిరోధక శక్తిని బలంగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి. అరటిపండులో ఉండే విటమిన్ సి, ఎ, ఫోలేట్ రోగనిరోధకశక్తి బలపడుతుంది.
  • అరటిపండును ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు బలపడతాయి. అరటిపండు తినడం వల్ల శరీరానికి మెగ్నీషియం, క్యాల్షియం పుష్కలంగా అందుతాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి పాలతో కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read :  వర్షాకాలంలో ఈ ఆహారాలను తినేటప్పుడు జాగ్రత్త..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు