/rtv/media/media_files/2025/10/10/drink-2025-10-10-07-04-29.jpg)
Drink
వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చాలా మంది వీటిని తీసుకుంటారు. కొందరు వేపాకు డైరెక్ట్‌గా తినడంతో పాటు వాటర్ తాగుతుంటారు. ఉదయం పూట పరగడుపున డైలీ వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఉదయం పూట వేపాకును ఎలా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Cancer Health Tips: ఈ చిన్న పరీక్షతో పదేళ్ల ముందే క్యాన్సర్ ను పసిగట్టొచ్చు.. అదేంటో తెలుసా?
కడుపు సంబంధిత సమస్యలన్నీ..
వేప ఆకులు రుచికి చేదుగా ఉంటాయి. దీన్ని తీసుకోవడానికి కొందరు పెద్దగా ఇష్టపడరు. కానీ ఇందులోని చేదు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా కాలేయం, బాడీలోని విషాలను ఈజీగా బయటకు పంపుతుంది. అలాగే డయాబెటిస్ సమస్యను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే వేప ఆకులతో రసం లేదా వేపాకు వాటర్ తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా పేగుల సమస్యతో బాధపడుతున్నారో.. వారు డైలీ ఈ ఆకుల రసం తాగితే అన్ని అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పులు వంటి సాధారణ సమస్యలు తగ్గుతాయి. అలాగే నోటి దుర్వాసన వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఈ రసం ఎలా తయారు చేయాలంటే?
వేప ఆకులతో రసం లేదా నీటిని తయారు చేసుకోవాలి. అయితే దీని కోసం మొదటిగా కొన్ని వేపాకులను తీసుకుని వాటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీరు పోసి ఆ ఆకులు వేసి మరిగించాలి. నీరు సగం వరకు వచ్చిన తర్వాత గ్యాస్ ఆడి.. వడకట్టి తాగాలి. అయితే ఇలా తాగలేని వారు ఆ ఆకుల పౌడర్ చేసుకుని నీటిలో కలుపుకోవాలి. లేదా ఆకులను మిక్సీ చేసి రసం తయారు చేసుకోవాలి. ఉదయం పూట ఖాళీ కడుపుతో మీకు నచ్చిన విధంగా వేపాకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా తగ్గిపోవడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Black coffee: బ్లాక్ కాఫీతో కాలేయానికి రక్షణ.. సిర్రోసిస్, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందంటున్న నిపుణులు!!