/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/morning-jpg.webp)
Morning
సీజన్‌తో సంబంధం లేకుండా అరటి పండ్లు లభిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోటాషియం, కాల్షియం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే చాలా ఈ అరటి పండును తింటుంటారు. కానీ పరగడుపున అరటి పండ్లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుందని..
అరటి పండ్లను ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు. కానీ ఏం తినకుండా పరగడుపున అయితే అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అరటి పండు ఎక్కువగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. పరగడుపున దీన్ని తీసుకుంటే జీర్ణక్రియపై ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అరటి పండ్లను ఉదయాన్నే తినవద్దు.
ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
ఏదో ఒకటి తిన్న తర్వాత అరటి పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం గుండె, కిడ్నీ ఆరోగ్యం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. రోజుకి ఒక రెండు అరటి పండ్లు తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలసట అంతా కూడా తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక