Diwali: దీపావళి వచ్చేసింది. ఇంకో ఐదు రోజుల్లో దీపావళిని దేశవ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుపుకోనున్నారు. ఆరోజున దేశం మొత్తం దీపాలు వెలిగించి ఈ దీపావళిని సంబరంగా జరుపుకుంటారు. జీవితంలో నెలకొన్న చీకట్లను ఈ దీపావళి దూరం చేస్తుందని భక్తులు నమ్ముతారు. అలాంటి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి రోజున పెట్టె దీపానికి ఇంకా అధిక ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Also Read: నాలుగు గంటల్లోపే శంషాబాద్- విశాఖ!
అలాంటి దీపాలను పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దని, అలా చేయడం వల్ల ఎంతో అశుభమని పండితులు అంటున్నారు. అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు, దీపాలను ఏ విధంగా వెలిగించాలి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
దీపాలను వెలిగించేటప్పుడు చేయకూడని తప్పులు..
ఎలా వెలిగించాలంటే.. దీపం అనేది దేవతాస్వరూపం. దీపాన్ని దేవుడికి సమానంగా పూజిస్తుంటారు. అలాంటి దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం ప్రమిదకు ముందుగా గంధం పెట్టుకోవాలి. అలాగే కుంకుమ, పూలు పెట్టి నమస్కరించుకోవాలి. అనంతరం అక్షింతలు సమర్పించి పూజించాలి.
మట్టి ప్రమిదలే - చాలా మంది తమకున్న డబ్బులను చూపించేందుకు, ఆధునిక పోకడలకు అలవాటు పడడంతో వెండి, బంగారం వంటి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపాలను ఇలాంటి ప్రమిదల్లో వెలిగించడం కంటే మట్టి ప్రమిదల్లో వెలిగించడం మంచిదని పండితులు, పెద్దలు చెబుతున్నారు. లోహం వేడి ఎక్కితే భూమి వేడెక్కుతుందని అది భూమాతను ఇబ్బంది పెడుతుందని అంటుంటారు. అందుకే మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించాలని అవి వేడిని గ్రహిస్తాయని చెబుతారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఎన్ని వత్తులు ఉండాలంటే..
చాలా మంది ఒకటే ఒత్తి పెట్టి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపాలను వెలిగించడం శుభసూచకం కాదని చెబుతున్నారు. దీపాలను రెండు లేదా మూడు వత్తులు చేసి వెలిగించాలని, అప్పుడే శ్రేయస్కరమని పండితులు అంటుంటారు. అయితే దీపాలను ఏ నూనెతో పడితే ఆ నూనెతో వెలిగించకూడదు. ఆవు నెయ్యి , నువ్వుల నూనెతో వెలిగిస్తేనే ఆ దీపం పవిత్రత ఉంటుందని పెద్దలు అంటుంటారు.
Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్
దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు.. దీపావళి రోజున లక్ష్మీదేవికి దీపాలు వెలిగించి ఆరాధన చేయడం వల్లే.. పోయిన తన ఐశ్వర్యం తిరిగి పొందాడని పురాణాల్లో ఉంది. అందుకే దీపావళి రోజు దీపాలు పెట్టి లక్ష్మీదేవికి పూజలు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని నమ్ముతుంటారు. దీపం ఎందుకు వెలిగిస్తారంటే.. దీపం అనేది జీవాత్మకు, పరమాత్మకు ప్రతీక. అందుకే ఏదైనా పూజ చేస్తప్పుడు లేదా దేవుడిని ఆరాధించేటప్పుడు ముందుగా దీపం వెలిగించి తరువాత దేవుడికి పూజలు చేస్తూ ఉంటామనే సంగతి తెలిసిందే.
షోడసోపాచారాల్లో అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైనది దీపం. అందుకే ఈ దీపాన్ని ఏదైనా శుభకార్యామప్పుడు ముందుగా ఆరాధిస్తారు. అలాంటి పవిత్రమైన దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు.
Also Read: గుస్సాడీ కనకరాజు మృతి..ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు